ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్‌గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులపై బలంగా నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని చంపాలని చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని, రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ దారుణం చాలదా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు.. ఇక, ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో బంద్‌కు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండగా.. టీడీపీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు.. తమ ఇంటిపై దాడి చేశారంటూ వైసీపీపై పటమట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత పట్టాభి భార్య ఫిర్యాదు చేశారు.. తమపై పెట్రోల్ పోశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో తెలుగు మహిళలు కంప్లైంట్ ఇచ్చారు… ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వాళ్లల్లో విజయవాడ వైసీపీ నేతలున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన వివిధ కార్పొరేటర్లు స్వయంగా దాడులకు పాల్పడ్డారని మండిపడుతున్నారు.. పలువురు రౌడీ షీటర్లు కూడా దాడులు పాల్పడిన వారిలో ఉన్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. తెర వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉందని టీడీపీ డౌట్ గా ఉంది.. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.