Suryaa.co.in

Andhra Pradesh

జోరుగా టీడీపీ చైతన్య రథయాత్ర

తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జోన్ -1 కు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలి నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.

ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథం యాత్రలో భాగంగా దార్లపూడి శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు శుభం జయం జరగాలని కోరడం జరిగింది. ఏటికొప్పాక ఫ్యాక్టరీని పరిశీలించారు. ఏటికొప్పాకలో బండిమాంబ అమ్మవారి దర్శనందర్శించుకున్నారు. పేట బయ్యవరంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలిలో టిడ్కో ఇళ్లు పరిశీలించి సెల్ఫీ ఛాలేంజ్ చేశారు.

కొక్కిరాపల్లి రైల్వే గేటువద్ద గల ప్లే ఓవర్ ను పరిశీలించి సెల్ఫీ ఛాలేంజ్ చేశారు. రాంబిల్లి మండలం కట్టుబోలు గ్రామంలో పర్యటించారు. దిమిలి గ్రామంలో ఎన్.టి.ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూడిమడక రచ్చబండ నిర్వహించి మేనిఫేస్టో గురించి ప్రజలకు వివరించారు. ఉరుమడక గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి రాబోయే రోజులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరంగా వివరించడమైనది.

ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ప్రగడ నాగేశ్వరావు, పప్పుల చలపతిరావు, కిమిడి నాగార్జున, వేపాద చిరంజీవి రావు, బుద్ధ నాగజగదీశ్వరావు, బోండా జగన్ ,రావు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జోన్-2
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జోన్ -2 కు సంబంధించి ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.

తుక్కులూరు నుండి నూజివీడు పట్టణం మీదుగా బత్తుల వారి గూడెం వరకూ బస్సుయాత్ర జరిగింది. మినీ మేనిఫెస్టోలోని ఆరు హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. తుక్కులూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద చైతన్య రథయాత్ర బస్సుకు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వందలాది బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి పీతల సుజాత, ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు, ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గంటా మురళి, ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జి బడేటి రాధాకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధబాబు, కార్యదర్శులు బొడ్డు వేణుగోపాల్, దాసరి శ్యామచంద్ర శేషు, దాసరి ఆంజనేయులు, ఏలూరు జిల్లా తెలుగురైతు అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, జోన్-2 టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, ఆచంట జడ్పీటీసి ఉప్పలపాటి సురేష్, టిడిపి నాయకులు అట్లూరి రమేష్, నూతక్కి వేణు, యలమందల నాని, నూజివీడు మండల టిడిపి అధ్యక్షులు ముసునూరి రాజా, బానోతు భద్రత నాయక్, గద్దె రఘు, మందపాటి బసవారెడ్డి, చిట్టిబాబు, నూజివీడు ఎఎంసి ఛైర్మన్ దేవినేని డలారామ్, ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రెడ్డి చందు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

జోన్-3
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జోన్ -3 కు సంబంధించి బాపట్ల పార్లమెంట్ పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.

ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రోత్ సెంటర్ పై సెల్ఫీ చాలెంజ్ విసిరారు. తిమ్మనపాలెం నుండి నాగులుప్పలపాడు వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 10 కోట్లతో నిర్మించిన తారు రోడ్డు పై సెల్ఫీ చాలెంజ్ చేశారు. మద్దిపాడు మెయిన్ సెంటర్ లో ఎన్టీఆర్, డా. బి.ఆర్. అంబేద్కర్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లవరం రిజర్వాయర్ గేట్లను పరిశీలించి సెల్ఫీ చాలెంజ్ చేశారు. మల్లవరం శ్రీ.వెంకటేశ్వర్లు స్వామి వారి గుడిలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నందిపాడు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మేనిఫేస్టోలోని ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, యం.యం. కొండయ్య, తెనాలి శ్రావణ్ కుమార్, బి ఎన్ విజయ్ కుమార్ , నరేంద్ర వర్మ, శ్రీరాం మాల్యాద్రి, సలగల రాజశేఖర్ బాబు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

జోన్-4
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జోన్ -4 కు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండేపి, కనిగిరి నియోజకవర్గాలలో చైతన్య రథయాత్ర జరిగింది.

జరుగుమల్లి-నర్సింగోలు-కామేపల్లి రోడ్డు మీదుగా బస్సు యాత్ర సాగింది. కలికివాయ-జరుగుమల్లి-కామేపల్లి బ్రిడ్జి వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసిరారు. కామేపల్లి గ్రామంలో గల ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కామేపల్లి నందు గల పోలేరమ్మ దేవస్థానం నందు పూజలు నిర్వహించారు. చెన్నుపాడు గ్రామంలోని సంగమేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ వద్ద సెల్ఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చెన్నుపాడు గ్రామంలో సంగమేశ్వర ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మర్రిపూడి మండలం నర్సరాజు పాలెం రాములు వారి దేవస్థానం వద్ద స్థానిక ప్రజలకు పార్టీ మ్యానిఫెస్టో గురించి వివరించారు. కనిగిరి నియోజకవర్గం గుడిపాడులోని రాములవారి గుడి, మసీదులలో పూజలు నిర్వహించారు. కనిగిరిలోని గుడిపాడులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జోన్-4 చైతన్య రథయాత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నూకసాని బాలాజీ, నరసింహ యాదవ్, ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, డా.డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల జనార్దన్ రావు, ముత్తముల అశోక్ రెడ్డి, గూడూరి ఏరిక్షన్ బాబు, శ్రీరామ్ చిన్నబాబు, పతగాని నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జోన్-5
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జోన్ -5కు సంబంధించి హిందుపురం పార్లమెంట్ పరిధిలోని కదిరి నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని పాదయాత్రగా బయలుదేరారు. ఎన్టీఆర్ సర్కిల్ కి పాదయాత్రగా చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలుస్తూ బట్రేపల్లి వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. కోరుకుంట్లపల్లి వద్ద తెలుగుదేశం హయంలో పూర్తి చేసిన హంద్రీనివా కాలువ వద్ద సెల్ఫీ తీసుకున్నారు. తలపులు మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ మేనిఫేస్టో లోని పథకాలు గురించి ప్రజలకు వివరించారు.

జోన్-5 చైతన్య రథయాత్రలో బీ కే పార్థసారథి, కోట్ల సుజాతమ్మ, పరిటాల సునీత, మల్లెల లింగారెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల శ్రీరామ్, గుండుమల్ల తిప్పేస్వామి, ఈరన్న, పల్లె రఘునాథ్ రెడ్డి, హనుమంతరాయ చౌదరి, సవితమ్మ,తిక్కరెడ్డి, ఫరూక్, గౌరు చరిత, గౌరు వెంకట రెడ్డి, అంబికా లక్ష్మి నారాయణ, నిమ్మల కృష్టప్ప, ప్రభాకర్ చౌదరి, ఎస్ నరసింహులు, ఎన్.టి రామానుంజమ్మ, బండారు శ్రావణి , పర్వీన్ భాను, నెట్టెం వెంకటేష్, ఏవిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE