Suryaa.co.in

Andhra Pradesh

పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

పిడుగురాళ్ల: నాటకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో గురజాల టీడీపీ సీరియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చక్రం తిప్పారు. దీనితో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో టీడీపీ శకం తిరిగి ప్రారంభమయినట్లయింది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియకు 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి, మిగిలిన కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

LEAVE A RESPONSE