Suryaa.co.in

Andhra Pradesh

ముస్లిం రిజర్వేషన్‌కు టీడీపీ కట్టుబడి ఉంది

– ఓటమి భయంతో టీడీపీపై తప్పుడు ప్రచారం
-చంద్రబాబు, అచ్చెన్నాయుడు పేర్ల మీద ఫేక్‌ లెటర్లు

-జాతీయస్థాయిలో చంద్రబాబుకు ముస్లింల మద్దతు
-బీసీలకు దేవుడు చంద్రబాబు…బీసీల ద్రోహి జగన్‌రెడ్డి
-జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
-చంద్రబాబు వస్తే రాష్ట్రానికి, అన్ని వర్గాలకు మేలు
-శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు

ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు చంద్రబాబుపై ముసిం రిజర్వేషన్లు, బీసీలపై తప్పుడు లెటర్లు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం టీడీపీ ఎమ్మెల్సీలు పర్చూరు అశోక్‌ బాబు, పంచుమర్తి అనురాధ, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ముసిం రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారని, టీడీపీ హయాంలోనే వారికి న్యాయం జరిగిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కుదించిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి అని మండిపడ్డారు. బీసీలకు సంబంధించి రూ.75 వేల కోట్లు దారిమల్లించారని, 30 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టి 300 మంది బీసీలను హత్య చేశారన్నారు. జగన్‌ పాలనలో బీసీలు, మైనార్టీలపై అత్యా చారాలు, హత్యలు పెరిగాయి. పేదల సంక్షేమానికి వాడాల్సిన నిధులు దారి మళ్లించి మోసగించాడని, కార్మిక, కర్షక, నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాలకు తీవ్ర అన్యా యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ముస్లింల మద్దతు
శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ముస్లిం మత పెద్దలు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబు లౌకిక వాది. మతసామర స్యాన్ని కాపాడుతారని వారు స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు తెలిపారన్నారు. గత ఐదేళ్లు బీజేపీతో కొమ్ముకాసిన వైసీపీ నేడు బీజేపీని బూచీగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా చేసిన సాయం శూన్యమన్నారు. చంద్రబాబు పాల నలో దాదాపు 45 వేల మందికి రుణాలు ఇచ్చాం. 36 వేల మందికి దుల్హాన్‌ పథకం అమలు చేశాం. విదేశీ విద్యతో రూ.10 లక్షలు ముస్లిం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇచ్చి ఆదుకున్నారు. ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ, జాబ్‌మేళాలను నిర్వహించి ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పించాం. మసీదులు, షాదీఖానాలు నిర్మించారు. ఉర్దూ భాషా వికాసానికి ప్రతి సంవత్సరం ఉర్దూ అకాడమీ ద్వారా రూ.15 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని ముస్లిం సమాజం మర్చిపోకూడదని గుర్తు చేశారు.

బీసీలకు దేవుడు చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ బీసీలకు దేవుడు చంద్రబాబు. బీసీలు పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ పార్టీ. సబ్‌ ప్లాన్‌ నిధులు అనే టైటిల్‌ను తీసుకు వచ్చింది చంద్రబాబు. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్‌ ఇచ్చింది చంద్రబాబు. బీసీలకు రక్షణ చట్టం తెస్తున్నారు. బీసీల సంక్షేమానికి రూ.3700 కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. బీసీలకు రెసిడెన్సియల్‌ సూల్స్‌ను పెట్టారు. బీసీలకు టీడీపీ చైర్మన్‌ పదువులు ఇచ్చారు. 16 యూనివర్సిటీల్లో దాదాపు 11 మంది బీసీలకు వీసీలుగా నియమించారు. జరగబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకమైన జగన్‌ రెడ్డి నడ్డి విరగ్గొట్టడం తథ్యం. టీడీపీ 161 సీట్లలో గెలవడం ఖాయం.

అన్ని వర్గాలకు అన్యాయం
ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ డీజిల్‌ పెట్రోల్‌ ధరలను పెంచాడు. ఆటో కార్మికుల ను ఇబ్బంది పెట్టాడు. భారీ ఫైన్లు వేసి చావబాదాడు. బతుకు జీవుడా అని లోన్లు తెచ్చు కుని ఆటోలు నడుపుకుంటున్న ఆటో కార్మికులు ఆటోలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టూరిజాన్ని సర్వనాశనం చేశాడు. టూరిజం మీద ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పో యారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏపీపీఎస్సీని స్కామ్‌లతో నాశనం చేశాడు. న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీతో పాఠశాలలను మెర్జ్‌ చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడు. చంద్రబాబు వచ్చిన వెంటనే నూతన విద్యావిధానాన్ని రద్దు చేసి మెగా డీఎస్సీ విడుదల చేస్తాం. పింఛన్‌ దారులు, భవన నిర్మాణదారులు జగన్‌ రెడ్డికి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు.

LEAVE A RESPONSE