Suryaa.co.in

Andhra Pradesh

రైతు గెలవాలి..వ్యవసాయం నిలవాలన్నదే టీడీపీ ధ్యేయం

-రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్ కేంద్రాలు
-వైసీపీకి అంతిమ ఘడియలు
-చంద్రబాబు, లోకేష్ ను తిట్టేందుకే ప్లీనరీ
-నందిగామ రైతుపోరు సభలో నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు

జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు భరోసా కేంద్రాలు కాదని..వైసీపీ బ్రోకర్ కేంద్రాలు అని టీడీపీ నేతలు మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా కుదేలు చేశారని ద్వజమెత్తారు. వైసీపీకి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని పరిటాలలో రైతుపోరు బహిరంగసభను నిర్వహించారు. తంగిరాల సౌమ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం అధ్యక్ష్యత వహించారు. ప్రసంగానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. వందలాది ట్రాక్టర్లుతో భారీ ర్యాలీగా సభాప్రాంగణానికి రైతులు వచ్చారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ దెబ్బతిన్న రంగం వ్యవసాయ రంగం. టీడీపీ హయాంలో 9 గంటల నిరాటంకంగా విద్యుత్ ఇస్తే…జగన్ 7గంటల విద్యుత్ 7 సార్లు కొత్త మీటర్లు ప్రకీయా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా…నీవు ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నావు? దేశం మొత్తం మైక్రో ఇర్రగరేషన్ ఉంటె..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు.? రాష్ట్ర లో భూసార పరీక్షలు ఆపివేయడంతో ..పంటదిగుబడి తాగింది. ఎపుడు లేని విధంగా రైతులు క్రాప్ హాలిడే కి వెళ్తున్నారు. పక్క రాష్ర్టంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయికపోతే….కేసీఆర్ స్వయంగా కొనుగోలు చేశారు. రాష్ట్రంలో రైతుల మెడలకు ప్రభుత్వం ఉరి తాళ్లు బిగిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో 20,వేల కోట్లు కేటాయించి కేవలం 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉంది’ అని ధ్వజమెత్తారు.

ఎంపీ కనకమేడలు రవీంద్ర మాట్లాడుతూ..‘కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై వైసీపీ ఎంపీలు భేషారతుగా మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో స్వామినదన కమిషన్ లోని అంశాలు ప్రస్తావించింది. అమరావతి ఉద్యమం ఆ ప్రాంత రైతులదే కాదు అందరిది. రైతులకు మద్దతు ధర కొసం పార్లమెంట్ లో పోరాడింది ఒక తెలుగుదేశం పార్టీ’ అని స్పష్టం చేశారు.

పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..‘రైతు సమస్యల పరిష్కారానికి వైకాపా ప్లీనరీలో ఒక్క మాట కూడా లేదు. ప్లీనరీలో వ్యవసాయ మోటర్లకు మీటర్ల రద్దు తీర్మానం ఎందుకు చేయలేదు. మోటార్లకు మీటర్లు పెడితే అన్ని సంక్షేమ పథకాలు రద్దవుతాయి. మీటర్లు ఎవరొచ్చి బిగిస్తారో వారిముందే వాటిని పగలకొడతాం. 3ఏళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్కమేలైనా చేశాడా. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో రైతులెవ్వరికీ తెలీదు. మిల్లర్ల దగ్గర కమిషన్లు కొట్టేసిన కొడాలినాని రైతుల ధాన్యం డబ్బులు ఎగ్గొట్టాడు’ అని మండిపడ్డారు.

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..‘వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు, పార్టీ నేతలు రైతుపోరు సభకు హాజరయ్యారు. రైతుపోరుతో చైతన్యాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఓట్లు వేయించుకుని జగన్ రైతుల్ని దగా చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రైతులు నష్టపోతున్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. వ్యవసాయం లాభిసాటిగా ఉండాలని భూసార పరీక్షలు చేశాం. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాం. గోదావరి-కృష్ణా నదులు అనుసందానం చేసి నీళ్లు అందించాం. ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఈ సీఎం చేతకాని తనమే. మోటార్లకు మీటర్లకు వద్దని పక్క సీఎం కేసీఆర్ అంటుంటే ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదు. కేంద్రమే మోటార్లకు మీటర్ల అంశంపై వెనక్కి తగ్గింది. కేసీఆర్ ను చూసైనా బుద్ధి తెచ్చుకోవడం లేదు. మోటార్లకు మీటర్లు ఉరితాడు కాబోతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ‘తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన వాడు జగన్ రెడ్డి. బాబాయ్ ని హత్య చేసిన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి. హత్య కేసు మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాల కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన వెన్నుపోటుదారుడు. కొడుకుని చీదరించుకుని హైదరాబాద్ లో ఉండేందుకు జగన్ రెడ్డి తల్లి సిద్ధమైంది. ఇంగ్లిష్ వింగ్లీష్ అంటూ రాష్ట్రంలో ఉన్న తెలుగు పోగొట్టాడు. జగన్ రెడ్డిలా మైండ్ కి లండన్ మందులు తెలుగుదేశం నేతలెవ్వరూ వాడట్లేదు. తాను దోచుకున్న డబ్బంతా జగన్ రెడ్డి దావోస్ ఫ్లైట్ లో తీసుకెళ్లిపోయాడు. డబ్బులు పడని ఉత్తుత్తి బటన్ లు జగన్ రెడ్డి నొక్కుతున్నాడు’ అని విమర్శించారు.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ‘రైతు సోదరులు మేల్కోవాలి. కేసుల మాఫీ కోసం రైతు ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. రైతుపోరు సభ ద్వారా వైసీపీకి అంతిమఘడియలు దగ్గరపడ్డాయి మీటర్లు బిగింపును రైతులంతా అడ్డుకోవాలి. రైతు భరోసా కేంద్రాలు అధికార పార్టీకి దళారీ కేంద్రాలుగా ఉన్నాయి. వైసీపీలోని రైతులకు కూడా న్యాయం జరగడం లేదు. ధరల స్థిరీకణకు 3వేల కోట్లు, విపత్తులకు 6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. జగన్ జైలుకు వెల్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. రైతులకు టీడీపీ స్వర్ణయుగం చూపించింది’ అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ‘తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకున్నాడు. ప్రకృతిని నమ్ముకుని రైతులు వ్యవసాయం చేస్తే అధికారాన్ని నమ్ముకుని జగన్ వ్యవసాయం చేశారు. అవినీతి పరులకు రైతుల బాధలు ఏం తెలుసు.? నదీ జలాలు ఉన్న జిల్లాలోనే రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. రైతు గెలవాలి..వ్యవసాయం నిలవాలన్నదే టీడీపీ నినాదం. రైతు గెలవాలంటే పంటలకు పెట్టే పెట్టుబడి తగ్గాలి. రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్ కేంద్రాలు. రైతులకు మేలు చేసే పరిస్తితి లేదు. భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఎరువులు దొరకడం లేదు. రైతులకు ట్రాక్టర్లు, యంత్రాలను టీడీపీ ప్రభుత్వం అందించింది. పంపుసెట్లు, సోలార్ వంటి ప్రతి వస్తువును అందించి చంద్రబాబు రైతు బిడ్డగా రైతులను ఆదుకున్నారు. రైతులను ఉద్దరిస్తున్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. రైతుల నుండి కొన్న ధాన్యాన్ని కేంద్రానికి అమ్ముకున్నారు. కాజాలో జరిగేది ప్లీనరీ కాదు..జబర్థస్త్. నీ తండ్రి ఉచిత విద్యుత్ పథకాన్ని తెస్తే నువ్వు మీటర్లు పెట్టి తూట్లు పొడుస్తున్నావు. మీకు అధికారాన్ని అప్పగించింది రైతులకు న్యాయం చేయడానికి కానీ, ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు మీటర్లు బిగించాలని కాదు. మోటార్లతో రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బొందలో పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ బొచ్చు మొత్తం పీకుతారు. మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల నెలకు 20 వేల కరెంట్ బిల్లు వస్తోంది’ అని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. నవరత్నాలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. రైతులకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నా దానికి ఈ ప్రభుత్వ అసమర్థతే కారణం. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతు దగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ధాన్యం బస్తాకు 200లు కమీషన్ వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలే చెప్తున్నారు. ధాన్యం సేకరణ రైతుకు మద్ధతు దర లేకుండా జరుగుతోంది. దళారులు తయారై ఇష్టారీతిని రైతుల్ని మోసం చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు వస్తే పరిహారం ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమా అని చెప్పి ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతులు పరిహారాన్ని కోల్పోయారు. చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిపితే రాత్రికి రాత్రి ప్రీమియం కట్టారు. 30 లక్షల మంది రైతులు బీమాకు అర్హులైతే 15 లక్షల మందికే ఇచ్చారు. జూలై వచ్చినా సబ్సీడీతో విత్తనాలు అందించడం లేదు. టీడీపీ గెలిస్తేనే వ్యవసాయం పండుగ అవుతుంది’ అని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ‘రైతు పేరుతో జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్నారు. 65 లక్షల మంది రైతులు ఉంటే 40 లక్షల మందికే రైతు భరోసా ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. 15 లక్షల మంది కౌలు రైతులుంటే 15 వేల మందికే రైతు భరోసా ఇస్తున్నారు. లక్ష కోట్లు రైతులకు ఖర్చు పెడితే వెయ్యికే ధాన్యాన్ని ఎందుకు అమ్ముకుంటారు రైతులు.? రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. స్కూటర్ల మీద తిరిగే వైసీపీ నేతలు భరోసా కేంద్రాలతో కార్లలో తిరుగుతున్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 ఇస్తున్నారు. రాష్ట్రంలో లక్ష మూగజీవాలు చనిపోయాయి. రూ.270 కోట్లు మూగ జీవాలకు పరిహారం ఇవ్వడానికి చేతులు రావడం లేదు. మీటర్లు పెడతామని బల్లగుద్ది చెప్తున్నారు. రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామంటే రైతులు నమ్మే పరిస్తితిలో లేరు. సుబాబుల్ రైతులు పోరాటం చేస్తుంటే వారి గోడు జగన్ పట్టించుకోకుండా ముసలికన్నీరు కారుస్తున్నారు. ప్లీనరీ వేదికగా అబద్ధాలు వల్లించారు. 151 సీట్లు వచ్చిన జగన్ 23 సీట్లు వచ్చిన టీడీపీకి భయపడుతున్నారు. టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? చంద్రబాబు అంటే జగన్ కు ఎక్కడో తెలియని భయం ఉంది. నాటి కాంగ్రెస్ హయాంలో వందల మంది కార్యకర్తలను హత్య చేశారు. జగన్ బనాయించే అక్రమ కేసులు కార్యకర్తలకు వెంట్రుకతో సమానం. టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు. జగనన్న వదిలిన బాణం షర్మిళ ఎక్కడున్నారో తెలీదు. తండ్రి లేని కొడుకు అని కన్నీరు కార్చి ఓట్లు వేయించిన తల్లిన నడిరోడ్డుపై వదిలిపెట్టారు. ఎన్నికలప్పుడు కేంద్రంతో చీకటి ఒప్పందం చేసుకుని అధికారులను అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చారు. డీజీపీ గౌతం సవాంగం అన్నా అని పిలిస్తే లాగి తంతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాడు. కుటుంబానికే న్యాయం చేయని జగన్ మనకు న్యాయం చేస్తాడా.? విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడితే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్తితి. వంచన, మోసం జగన్ రక్తంలో ఇమిడిపోయాయి. దేశంలో ఏ రైతులపై లేని అప్పులు ఏపీ రైతులపై ఉంది. దోపిడీ దారులకు వైసీపీ పాలన స్వర్ణయుగంలా ఉంది. సామంత రాజుల్లా అధికారాల్ని విభజించుకుని దోచుకుంటున్నారు. కొడాలి నానిని తంతే పశువుల కొట్టంలో పడ్డాడు’ అని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ..‘కష్టాల్లో ఉన్న ప్రజలెవ్వరికీ కనిపించని సీఎం జగన్ రెడ్డి. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల్ని ఆదుకునే పరిస్థితి రాష్ట్రం లో లేదు. విత్తనాలు, యూరియా బ్లాక్ లో కనుక్కునే పరిస్థితి రాష్ట్రం లో ఉంది. 3ఏళ్లలో 3శాతం పోలవరం పూర్తి చేయని అసమర్థుడు జగన్ రెడ్డి. ఎన్నికల హామీలు 5శాతం కూడా పూర్తి చేయకుండా 95శాతం పూర్తి చేసినట్లు అసత్యాలు చెప్తున్నారు. పార్టీకి జీవితకాల అధ్యక్షుడు గా జగన్ రెడ్డి ప్రకటించుకోవటం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతులే సమాధి కడతారు’ అని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ..‘ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మభ్యపెడుతున్నారు. సుబాబుల రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ నేటికీ పట్టించుకోలేదు. నిధుల కొరతతో వేదాద్రి ఎత్తిపోతల పధకం పూర్తికాలేదు’ అని అన్నారు.

తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘బోరులకు మీటర్లు రైతు మెడకు జగన్ సర్కార్ ఉరి వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మోటర్లు పెట్టారు. రైతులకు దానివలన ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ కేంద్రం చెప్పినట్లు నడుస్తున్నారు.ఇళ్ల స్థలాలు పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు జగన్ సర్కార్ మోటర్లకు పెట్టిన మీటర్లు ను బడ్డలకొడతాం’ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, పెద్దకూరపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవింద బాబు, మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, బాపట్ల ఇంఛార్జ్ నరేంద్రవర్మ, చీరాల ఇంఛార్జ్ ఎం.ఎం.కొండయ్య, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, తిరువూరు స్వామి దాసు, తిరువూరు ఇంచార్జ్ సేవలు దేవదత్తు, , గుంటూరు వెస్టి ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర, పామర్రు ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా, గుడివాడ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు, పెడన ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్, వైవీబీ రాజేంద్రప్రసాద్, గంజి చిరంజీవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE