తెలుగుదేశం..మీసం తిప్పుతోంది

Spread the love

-చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుపై పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తిన టిడిపి ఎంపీలు
-ఎంపీల‌ని అభినందించిన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌

టిడిపి అధినేత చంద్ర‌బాబుని త‌ప్పుడు కేసులో అక్ర‌మ అరెస్టు చేయించిన సైకో జ‌గ‌న్ తీరుపై దేశ‌మంతా చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేసిన టిడిపి ఎంపీల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అభినందించారు. ఢిల్లీలో పార్టీ ఎంపీల‌తో శుక్ర‌వారం ఆయ‌న స‌మావేశం అయ్యారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుని పార్ల‌మెంటులో చ‌ర్చ‌కి తెచ్చి, దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గ‌ట్టి పోరాటం చేశార‌ని ప్ర‌శంసించారు.

వైకాపా ఎంపీల హేళ‌న‌లు, మాట‌ల దాడుల‌ని త‌ట్టుకుని స‌మ‌ర్థ‌వంతంగా తెలుగుదేశం వాణిని పార్ల‌మెంటులో వినిపించార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో ఎంపీలు కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్, కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply