కాకినాడ : తెలుగుదేశం పార్టీలో తాజాగా జరిగిన కీలక నియామకాలు కాకినాడలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.
ఈ క్రమంలో యువ నాయకుడు నారా లోకేష్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించగా, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం, రాష్ట్ర కమిటీలోనూ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం స్థానిక నాయకుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఈ నియామకాలను పురస్కరించుకుని గురువారం ఉదయం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు. తీన్మార్ డప్పుల మోగింపుతో కార్యాలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. “జై తెలుగుదేశం”, “జై చంద్రబాబు”, “జై లోకేష్”, “జై సానా” అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగిపోయింది.
కార్యకర్తలు పరస్పరం , స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుల కార్యాలయ ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ, నారా లోకేష్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు, సానా సతీష్ బాబుకు జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పార్టీకి కొత్త దిశను చూపుతుందని అన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇస్తూ కాకినాడ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ పోలిటి బ్యూరో సభ్యులుగా మరియు రాష్ట్ర కమిటీ లో కూడా సభ్యులుగా నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు.
యువ నాయకుడు నారా లోకేష్ మరియు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నారీ శక్తికి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ విధానం ప్రశంసనీయమని తెలిపారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ను జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు.గతంలో నారా లోకేష్‌ను విమర్శించిన వారు నేడు ఆయన నాయకత్వాన్ని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ శక్తివంతంగా ముందుకు సాగి మళ్లీ అధికారంలోకి రావడానికి సమష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెళ్ల శ్రీనివాసరావు (బున్ని), ఏటుకూరి నాగమణి, దేవ్ వెంకన్న, బోళ్ళ కృష్ణమోహన్, న్యూటన్ ఆనంద్, రామదేవ సీతయ్య దొర,అప్పికొండ వి.వి. నరసింహ స్వామి, కాకరపల్లి చలపతిరావు, సునీత, రాయుడు దుర్గ, , ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, సీతామహాలక్ష్మి, ఉదయ్, సిరియాల కొండబాబు, అద్దంకి రాము నాయుడు, పెద్ద సంఖ్యలో మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.