Suryaa.co.in

Political News

పేదవాడి ఆత్మగౌరవం కోసమే బతికిన తెలుగుదేశం

పేదల ఆకలి తీర్చాలన్న ఆశయంతో పథకాలు
”పేదరిక నిర్మూలన కొరకు అక్టోబర్ 17న అంతర్జాతీయ దినోత్సవం”

1987వ సంవత్సరం పారిస్ నగరం లో పేదరికంతో కూడుకున్న ఆకలి, భయం మరియు హింసలవలన ఆందోళనకు గురైన బాధితులకు అండగా ఉండేందుకు ”అందరూ కలసి గౌరవంగా జీవిద్దాం” (All Together in Dignity) వ్యవస్థాపకులు ‘జోసెఫ్ రెసిన్ స్కిచే’ పిలుపు మేరకు ‘ఒక లక్ష మంది’ గుమిగూడి పేదరిక నిర్మూలనకు సమ్మతి ప్రకటించడం జరిగింది.
జోసెఫ్ రెసిన్ స్కిచే 1992 లో మరణించిన తరువాత ఐక్యరాజ్యసమితి అధికారికంగా అక్టోబర్ 17 వ తేదీ ని ‘పేదరిక నిర్ములన కొరకు అంతర్జాతీయ దినోత్సవంగా’ ప్రకటించడం జరిగింది.

తెలుగుజాతి, తెలుగు ప్రజలు పేదరికంలో మగ్గకూడదు అని, కూడు-గుడ్డ-నీడ అనే నినాదంతో ‘పేద ప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయం’ గా భావించిన అన్న ‘నందమూరి తారకరామారావు’ ”తెలుగుదేశం పార్టీ” స్థాపించి పేదవారికి కూడు-గుడ్డ-నీడ అందించి ఆత్మగౌరవం తో బ్రతికేలా చేశారు.

ప్రస్తుత ‘తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు’ కూడు-గుడ్డ-నీడ అందించడంతో పాటు ప్రజలను ఆర్ధిక స్వావలంబన దిశగా తీసుకెళ్లాలనే క్రమంలో ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకుని, నేను పని చేస్తాను- మీరూ పని చేయండి అని ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీ పెంచడానికి ప్రయత్నించి వారి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది.

ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారికానీ ప్రభుత్వ ఉద్యోగుల సోమరితనానికి ( అప్పటి ) వంతపాడటం కాదు, రాజకీయ అవసరాలకు, అధికార కాంక్షకు నిర్లప్తత తగదు అని భావించి, అభివృద్ధి- ఆదాయం పెంచడం అనే రెండువైపుల పదునైన కత్తిమీద సాముచేసి, నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదాయం సృష్టించిన నేత…

ముఖ్యంగా ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ – సికింద్రాబాద్ – సైబరాబాద్ లను రెండున్నర దశాబ్దాల క్రితమే ఆర్ధిక స్వావలంబనకు బీజం వేసి, పెంచి పోషించి, అభివృధి చేసి ఫలాలు అందేనాటికి ”ఇనిస్టెంట్ ” మాయాజాల, టక్కుటమార, ఊసరవెల్లి రాజకీయాలకు, విద్వేష-విభజన, కులం-మతం-ప్రాంతం వంటి మాదకద్రవ్యాలకు మించిన మత్తు యువతకు ఎక్కించి, ”తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో నారాచంద్రబాబు నాయుడు ” సృష్టించిన ఆదాయవనరులను పప్పు బెల్లాలుగా భోంచేస్తూ…ప్రజలకు పధకాల పేరుతో ఎంగిలి చేతులు విదిలించి వారి బానిసలుగా భావిస్తూ రాజ్యమేలుతున్నారు… అక్కడా ! ఇక్కడా !!

పేదవారు తమ కాళ్ళమీద తాము నిలబడి, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలి అనే సిద్ధాంతం 80 దశకం మొదట్లో తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్ , నారా చంద్రబాబు నాయుడు , అదే 80 వ దశకం చివర్లో ”అందరూ కలసి గౌరవంగా జీవిద్దాం” వ్యవస్థాపకులు ‘జోసెఫ్ రెసిన్ స్కిచే’ చేసిన కృషి ఆదర్శం, ఆచరణీయం.

పేదరికం నుండి బయటపడాలంటే బానిసత్వంతో కాకుండా బాసటగా ఉండేవారికి పట్టం కడదాం. తెలుగుజాతి గుండెచప్పుడు అన్న ఎన్టీఆర్ స్వర్గానికెళ్లారు, ప్రపంచ పేదవారికై తాపత్రయపడిన జోసెఫ్ రెసిన్ స్కిచే అమరులైనారు.

తెలుగు ప్రజల ఆర్ధిక పరిపుష్టే నా ధ్యేయం, తెలుగు యువత నైపుణ్యత మెరుగుపరుచుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని తపించిన తపస్వి నారా చంద్రబాబు నాయుడు” అన్యాయపు, అసంబద్ధ, వక్రబుద్ధి ‘త్రిమూర్ఖుల’ కుట్రకి చెరసాలలో న్యాయదేవత నిర్ణయానికి వేచివున్నారు.

– వేజెండ్ల కిషోర్ బాబు
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,
పెద్దపల్లి పార్లమెంట్ పరిశీలకులు.
తెలుగుదేశం పార్టీ, తెలంగాణా.

LEAVE A RESPONSE