– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం నేడు జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా బట్టబయలైంది. వైసీపీ నేతల అరాచకం, అధికార గణాన్ని అడ్డుపెట్టుకుని అనేక ప్రతిబంధకాలు సృష్టించినా టీడీపీ అభ్యర్థులు మొక్కవోని ధైర్యంతో పోరాడి విజయం సాధించారు.
జగన్మోహన్ రెడ్డి అరాచక, అవినీతి, రైతు వ్యతిరేక విధానాలకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఓటు ద్వారా ప్రజలు వైసీపీకి వేటు వేశారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలబడ్డ అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో కూడా రెట్టింపు ఉత్సాహంతో, మొక్కవోని ధైర్యంతో, ఈ అరాచక పాలనపై పోరాడి తెలుగుదేశం పార్టీ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రజా సేవలో పునీతులమవుదాం.