Suryaa.co.in

Andhra Pradesh

శ్రీరాముడి విగ్రహం వెంట కన్నీరు

– మునగపాడులో వింత ఘటన
శ్రీరాముడి విగ్రహం వెంట కన్నీరు కారుతుండడం కలకలం రేపింది. దీంతో శ్రీరాముడ్ని చూసేందుకు భారీగా భక్తులు గుమిగూడుతున్నారు. రాముల వారికి ఏమైంది అంటూ వారు కూడా కన్నీరు పెడుతున్నారు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని మునగపాడులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
రోజులుగా రాముల వారికి పూజ చేద్దామని పూజారి సిద్ధమైతే.. ఆ సమయంలో రాముడి కళ్ల వెంట నీరు రావడంతో రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతుంది. చూసి ఆశ్చర్యపోయిన పూజరి.. ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందారు. విషయం ఊరిలో అందరికీ తెలియడంతో జనం పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివస్తున్నారు. రెండేళ్ళుగా సీతారాముల కళ్యాణం నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు.గ్రామాస్తులకే కాక ఈ సమాచారం చుట్టుపక్క గ్రామాలకు వ్యాపించడంతో జనం తాకిడి పెరిగింది.
శ్రీరాముడు ఏదో సంకేతం ఇస్తున్నారని భక్తులు భావిస్తున్నారు. మానవ జాతికి రాబోతున్న ముప్పుకు ఇది సంకేతమంటున్నారు. అయితే ప్రస్తుతమున్న వైపరిత్యాల నేపథ్యంలో రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట చింతపండు రసంతో విగ్రహాలకు ఉన్న ఇత్తడి కళ్ళు తుడవడం వల్ల ఇప్పుడు నీరు కారుతున్నాయేమో అంటూ ఆలయ పూజారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులు మాత్రం సీతారాముల కళ్యాణం జరిపించకపోవడం వల్లే ఇలా జరుగుతోంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీతారాముల విగ్రహాల నుంచేకాక లక్ష్మణ, హనుమ విగ్రహాల నుంచి కూడా ఇలాగే నీరు కారుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే తమ గ్రామానికి అరిష్టం జరగబోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అరిష్టం జరగకుండా రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A RESPONSE