Suryaa.co.in

Telangana

బీజేపీ పోరాటం వల్లే తెలంగాణ

– సికింద్రాబాద్‌ జిల్లా బీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ అధ్యక్షుడు అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సీతాఫల్మండి లో జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణ మూర్తి , కార్యదర్శి కనకట్ల హరి , కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, భాస్కర్ గిరి, ముఠా గణేష్, సురేష్, మామిడి నాగేష్, ఈ ఎల్ ప్రతాప్, నరేష్, దత్తు, బాబు, కిట్టు, రాజు, రాకేష్, తదితరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మేకల సారంగపాణి, కృష్ణమూర్తి, కనకట్ల హరి అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పిడిందంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఉద్యమకారులకు పూర్తిగా సంపూర్ణ మద్దతునిచ్చి ప్రత్యక్ష పోరాటం నిర్వహించడం వల్లనే తెలంగాణ సాధించామని అన్నారు.

ఆనాటి బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ చొరవవల్లే పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఆమె పోరాట స్ఫూర్తి వల్లనే తెలంగాణను సాధించుకున్నామని అన్నారు.. ఏర్పడిన రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నది. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు.

నయవంచక కేసిఆర్ ను గద్దె దించాల్సిందే అన్ని పేర్కొన్నారు.. అనంతరం చౌరస్తాలో ప్రజలందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE