Suryaa.co.in

Telangana

బీసీ రిజర్వేషన్లు ,ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ

– ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహించాలి
– నోవాటెల్ లో సీఎల్పీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : కుల గణన దాని తరువాత జరిగిన ప్రక్రియ సబ్ కమిటీ,బీసీ డెడికేటెడ్ కమిషన్ కేబినెట్ అప్రూవల్ సభలో యాక్ట్ 2,3 ద్వారా బీసీ లకు 42 శాతం స్థానిక సంస్థలు,విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపడం జరిగింది. ఈనెల ఏప్రిల్ 8 న ఆమోదం పొందింది. గవర్నర్ కి ధన్యవాదాలు.

బీసీ ల రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా రెండు నెలల్లో విషయాన్ని తేల్చాలని చెప్పింది. తప్పకుండా సానుకూలంగా తీర్పు వస్తుంది. శాసన సభలో బీసీ ల రిజర్వేషన్ల పై అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. కుల గణన సర్వే ప్రామాణికంగా సమాచారాన్ని లక్ష మంది ఉద్యోగుల ద్వారా చేయడం జరిగింది.

న్యాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సమాచార సేకరణ జరిగింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీసీ ల నాయకులు ,కుల సంఘాల నాయకులు ,ఉద్యోగ సంఘాల నాయకులు ,బీసీ మేధావులను పిలిచి చారిత్రాత్మక ప్రక్రియ 1931 స్వాతంత్ర్య ఉద్యమ తరువాత జరిగిన కుల సర్వే మళ్ళీ ఇప్పుడు మాత్రమే జరిగిందని ప్రజలకు అవగాహన కల్పించాలి.

ఈ అంశాన్ని సానుకూలంగా పార్టీ పరంగా ప్రజలంతా మనవైపు చూసేలా కార్యక్రమాలు నిర్వహించాలని శాసన సభ్యులు ,మండలి సభ్యులు , పార్లమెంట్ సభ్యులకు కోరడం జరిగింది. దేశంలోనే బీసీ ల రిజర్వేషన్లు ,ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది రాహుల్ గాంధీ గారు దీనిని ప్రశంసించారు. ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహించాలి..

LEAVE A RESPONSE