సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట మేనిఫెస్టో
మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా ట్యాగ్ లైన్ తో మేనిఫెస్టో
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా
తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంతో మంది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించలేదు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క తెలంగాణకే రెండున్నార లక్షల కోట్లు నిధులు కేటాయించాం.
అంటే 160 శాతం రేట్లు అధికంగా కేటాయించాం. తెలంగాణకు గిరిజన వర్సిటీని మోడీ అందించారు. నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్లు తెలంగాణకు ఇచ్చాము. నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్ మెట్రోకు 1200 కోట్ల కంటే ఎక్కువ నిధులు ఇచ్చాం. కేసీఆర్ పార్టీ ప్రజలకు ఏం చేసింది?
కేసీఆర్.. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు మాత్రం నిర్వహించడం లేదు. ఒవైసీకి భయపడి నిర్వహించడం లేదు. లోక తంత్రం వదిలి.. లూట్ తంత్రాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారు. కుటుంబ పాలనకు పరిమితమయ్యారు. కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరిట తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడితే.. అవి అమలు కాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. పాలమూరు రంగారెడ్డి పెండింగ్ లో ఉంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారు. ప్రతి ప్రాజెక్టులో వీరికి కమీషన్లు ఇవ్వాలి. 17 సార్లు పేపర్ లీక్ అయింది. ఎందరో మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. స్కూళ్ళు, కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారు. లోన్లు మాఫీ చేస్తామని మోసం చేశారు. డబుల్ ఇండ్లు ఇవ్వలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టలేదు.
కేసీఆర్.. పార్టీ.. అభివృద్ధి వ్యతిరేక పార్టీ. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. వారు అధికారంలోకి రారు.. అయినా కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు. లిక్కర్, గ్రానైట్, మిషన్ కాకతీయ.. ఇలా ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారు.అవినీతి చేయాలంటే.. ఎవరైనా భయపడతారు. కానీ కేసీఆర్.. అవినీతి చేసి.. చేసి.. అలవాటు పడిపోయారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. అవినీతి చేసేందుకు ఏమాత్రం భయపడటం లేదు.
కేసీఆర్.. కారు స్టీరింగ్.. ఒవైసీ చేతిలో ఉంది. 10 ఏండ్లలో.. ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. తాంత్రికులు చెప్పారని.. కేసీఆర్ పార్టీ పేరు మార్చాడు. తాంత్రికులు చెప్పినట్లుగా వారి సలహాల మేరకు కేసీఆర్ నడుచుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడం బీజేపీ పనికాదు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు యాక్షన్ తీసుకుంటాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జికి కూడా సిఫారసు చేస్తాం. ధరణి పోర్టల్ భూకుంభకోణాలపై కూడా విచారణ చేపడుతాం.
బీజేపీ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ను విభజించాము.. కానీ ఎక్కడా రక్తపాతం జరగలేదు.
ఓడిపోయే వాళ్ళు ఓడిపోతామని ఒప్పుకోరు కదా.. అందుకే మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయి. ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవి.. వారంతా ప్రశ్నించాలి. గ్యాస్ సిలిండర్ల తగ్గింపు అంశంపై రాష్ట్ర, కేంద్ర సర్కార్ రెండు కలిసి తగ్గిస్తే.. పేదలపై భారం పడదు.. కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ వెళ్తోంది.. అందుకే.. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ పార్టీ మారారు. వాళ్ళ కోసం మేము మా విధానాలు మార్చుకోలేం కదా? కేసీఆర్ మా పార్టీలో కోవర్టులు ఉన్నారంటున్నాడు.. మరి కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తే కదా? డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసేది ఎవరో చూస్తారు.
2023 తెలంగాణ బీజేపీ మ్యానిఫెస్టో
అవినీతి రహిత పాలన
ప్రభుత్వ అవినీతిపై ,అన్ని కుంభకోణాలపై విచారణ కమిటీ
ఉచితంగా అయోధ్యకు ,కాశీ యాత్రకు తీసుకెలుతాం,ఉచిత దర్శనం చేయిస్తాం
6 నెలలకు ఒక సారి TSPSC ద్వారా నియామకాలు
వైద్య శ్రీ ద్వారా అర్హత కుటుంబాలకు 10లక్షలు వరకు ప్రైవేట్ హాస్పిటల్ ఉచిత ఆరోగ్య కవరేజి
సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం
ఆగస్టు 27 న రజాకార్ల అరాచకాల సంస్మరణ దినంగా (బైరాన్ పల్లి,పరకాల ఊచకోత)నిర్వహిస్తాం
హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను, అక్రమ వలసదారులను,యుద్ధప్రాతిపదికన బహిష్కరిస్తాం
UCC (ఉమ్మడి పౌర స్మృతి) పై రోడ్ మ్యాప్ కి కమిటీ
రైతులకు ఎకరాకు 18వేల వివిధ సబ్సీడీల ద్వారా ప్రయోజనం
వరి రైతులకు కనీస మద్దతు ధర 3100 రూపాయలు ఇస్తాం
మద్యం షాపులు వద్ద ఉన్న పర్మిట్ రూమ్స్,బెల్టు షాపులు 100 శాతం నిర్మూలన
గ్రామాల్లో మద్యం షాపులపై మహిళల నిర్ణయమే ఫైనల్
రాణి రుద్రమ పేరిట మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు
ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ
వన్ టైం సెటిల్మెంట్ ఫీజు రీఅంబర్స్ మెంట్ బకాయిలు పూర్తి చేస్తాం
విద్యార్థులకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్,100 సీఎం లైబ్రరీ ,స్టడీ సెంటర్లు
రాష్ట్రంలో అర్హత కుటుంబాలకు 5లక్షల ఆరోగ్య భీమా
ఉద్యోగ ,ఉపాధికల్పనకు,పెట్టుబడులకు, కొత్త కంపెనీల ఏర్పాటుకు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్
ఆదిలాబాద్,వరంగల్,నిజామాబాద్ లలో ఉడాన్ విమానాశ్రయాలు
తెలంగాణలో,హైదరాబాద్ లో చాలా సంవత్సరాలుగా మునిగిపోతున్న కాలనీలు గుర్తించి సత్వర పరిష్కారం,కొత్త డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం