రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద, మొట్టమొదటి రోప్ వే ను మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్మిస్తున్నా సంధర్బంగా కలకత్తా, ముంబైకి చెందిన దేశంలోని ప్రముఖ రోప్ వే సర్వీస్ ప్రొవైడర్లు తో సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహబూబ్నగర్లోని మన్యంకొండ దేవాలయం వద్ద నిర్మిస్తున్న రోప్ వే వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల పర్యాటక ప్రదేశాల వద్ద నిర్మించిన పలు రోప్ వే డిజైన్లను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు.
మహబూబ్నగర్లోని మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్మించనున్న రోప్ వే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహించారు అన్నారు సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. పర్యాటకుల అభిరుచి కి అనుగుణంగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో పర్యాటక ప్రదేశాలలో ఆధునిక మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ స్థాయిలో తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా దేశ విదేశాలలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలకు ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతి సిద్ధమైన జలపాతాలు, కోటలు, కొండలు, సెలయేర్లు, అడవులు, ఎకో టూరిజం కేంద్రాలు, గిరిజన సంప్రదాయాలు, బుద్ధిజం, సాంస్కృతి కి, మెడికల్ టూరిజం, IT, ITES రంగాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.