విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ని కలిశారు. తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ.జె.యు, ఎ.పియు.డబ్ల్యూ, జె నేతలతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ చైర్మన్లు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా జర్నలిస్టులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఐ.జె.యు జాతీయ కార్యదర్శి డి.సోమసుందరరావు, ఎ.పి.యు.డబ్ల్యూ.జె రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఎ.పి.యు.డబ్ల్యూ.జె ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.