Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కుకి భరోసా కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు

– రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్

అనకాపల్లి: విశాఖ ఉక్కుని నష్టాల నుంచి కాపాడేందుకు కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.విశాఖ ఉక్కుకి భరోసా కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేకంగా ధన్యవాదములు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నష్టాల భారి నుంచి బయట పడటంతోపాటు, ప్లాంట్ అభివృద్ధికి కూడా దోహద పడే అవకాశాలున్నాయన్నారు.

విశాఖ స్టీలు ప్లాంట్ కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వేల మంది జీవనోపాది పొందుతున్నారన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇంత కాలం ఆందోళనలు జరిగినప్పటికీ, కేంద్రం ఉక్కు విషయంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించం ద్వారా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నవారికి పెండింగ్ జీతాలు ఇవ్వడంతోపాటు, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

ప్రైవేటు పరం అయిపోతుందని అంతా భావించిన తరుణంలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా విశాఖ ఉక్కుకి ఏం ఢోకా లేదనే సంకేతం ఇచ్చినట్టు అయ్యిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సారధ్యంలో విశాఖ ఉక్కు ఇక డోకా లేకుండా పనిచేయడంతోపాటు మళ్లీ పూర్వ వైభవం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి మరియు విశాఖ ఉక్కు కోసం ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు కి, యువగళం లో మాట ఇచ్చి నిలబెట్టిన నారా లోకేష్ కి మరియు స్టీల్ ప్లాంట్ లో సభ పెట్టి భరోసా నిచ్చిన డిప్యూటీ సీ.ఎం పవన్ కళ్యాణ్ కి కి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున మరియు ఉత్తరాంధ్ర వాసులు తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A RESPONSE