- ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యుల తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ శ్రీకారం చుట్టారు. నియోజవర్గంలో మొదట గోకవరం మండలంలో పలుచోట్ల సిసి రోడ్లకు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు.
కామరాజుపేట కొత్తపల్లి గోకవరం కృష్ణుని పాలెం మల్లవరం గ్రామాలలో పలు సిసి రోడ్లకుడ్రైనేజ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోకవరం మండలానికి 10 కోట్ల 75 లక్షల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు.
కామరాజుపేటకు 70 లక్షలతో 6 సి సి రోడ్డు, కొత్తపల్లిలో ఐదు సిసి రోడ్లకు గాను 50 లక్షలు, కృష్ణుని పాలెం లో రెండు సిసి రోడ్డు మరియు డ్రైన్ 60 లక్షలు,గోకవరం10సి సి రోడ్లు గాను 2 కోట్ల 50 లక్షలతో సుమారు పది రోడ్డు సిసి రోడ్లకు, మల్లవరం గ్రామం 40 లక్షలతో రెండు సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గతంలో తడికొండకు 3 కోట్ల 75 లక్షలతో కలిపి మొత్తం 10 కోట్ల 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్లలో తీసుకు పోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.