ప్రసన్నపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయమైన చర్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకురాలు ప్రసన్నపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య. ఒక మహిళా నాయకురాలిపై న్యాయవాదుల రూపంలో టీఆర్ఎస్ దాడులు చేయించడం సిగ్గు చేటు. మహిళపై భౌతిక దాడి చేయడం పిరికిపంద చర్య. టీఆర్ఎస్ కు అణువణువునా బీజేపీ అంటే వణుకుపుడుతోంది. అందుకే భౌతిక దాడులకు తెగబడుతోంది.

ప్రసన్నపై కోర్టు పరిసరాల్లో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడిని సీఎం కేసీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? దేశంలోనే శాంతిభద్రతల్లోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్…. దీనికేం సమాధానం చెబుతారు? ప్రసన్నపై దాడి చేసిన బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి.