ఆర్యవైశ్య నేత సుబ్బారావు గుప్తాపై దాడి అమానుషం

Spread the love

-రాష్ట్రంలో శాంతి భద్రతలకు, భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు
– ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే దాడులా?
– అమరావతి బహుజన జెఎసి పోతుల బాలకోటయ్య

ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన నేరానికి ఆ పార్టీకి చెందిన ఆర్యవైశ్య నేత సుబ్బారావు గుప్తా పై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరులు దాడి చేయడం దారుణమని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తీవ్రంగా ఖండించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు, పౌర స్వేచ్ఛ కు ఇదో నిదర్శనంగా చెప్పారు.

దాడి చేయడమే కాక సెల్ఫీ వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో చేసిన బరితెగింపుకు డిజిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దండం పెట్టి వేడుకుంటున్నా, ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్తున్నా పరుషపదాలతో దూషిస్తూ, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పాలని బెదిరించడం వైకాపా పరిపాలనకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల పై జరుగుతున్న దాడులకు సుబ్బారావుపై జరిగిన దాడి పరాకాష్టగా అభిప్రాయపడ్డారు. క్రింది కులాల పై అధికార బలంతో, పోలీసుల అండతో ఏది చేసినా చెల్లుతుంది అన్న పాలనకు చరమగీతం పాడాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు. సంఘటనను పోలీసులు సుమోటోగా స్వీకరించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply