– కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి
– కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావులు తలకిందులు తపస్సు చేసిన ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు
-కలెక్టర్ పై దాడి వెనక ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించం
-కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పెద్దలతో ఒప్పందం చేసుకున్న బిఆర్ఎస్
– మహారాష్ట్రలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పడం ఇందుకనే అర్థమవుతుంది
– ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది
– మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి
– సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ : బిఆర్ఎస్ కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారంగా అరాచక శక్తులతో అమాయకమైన దళిత గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించింది. లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక కాల్ డేటా తీయగా, బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తెలుస్తున్నది. లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన సంఘటనలో ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించం చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం.
లగచర్లలో కలెక్టర్, ఇతర ఉన్నత స్థాయి అధికారులపై జరిగిన దాడిని ప్రజా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. అత్యంత ప్రజాస్వామ్యుయుతంగా ఎవరి సమస్యనైనా వినడానికి ప్రజా ప్రభుత్వం తలుపులు తెరుచుకొని కూర్చున్నది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులతో చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం ఇవన్నీ అవకాశాలు ఉండగా, కుట్రపూరితంగా బిఆర్ఎస్ నాయకులు అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గం.
రాష్ట్రంలో పరిశ్రమలు రావొద్దు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దు అభివృద్ధి జరుగొద్దు అనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరించడం మంచిది కాదు.బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ కొరకు భూసేకరణ చేసిన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షం పార్టీగా రైతుల పక్షాన గొంతెత్తినం, అధికారులను కలిశాం, న్యాయస్థానానికి వెళ్ళాం, పత్రికల ద్వారా మా నిరసనను తెలియజేశామే తప్ప ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు.
కలెక్టర్ పై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేద్దామని అనుకుంటే పొరపాటు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. చట్ట ప్రకారం వారిపై చర్యలు తప్పవు. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని అడుగుతున్న ఇలా దాడులు చేయించడం కరెక్టేనా? బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడండి. ఇట్లా దాడులు చేయించడం పై సమాజానికి ఏం సందేశం ఇస్తారు? ఈ దాడులు ఎటువైపు దారి తీస్తాయో మీకు తెలియదా? కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి.
ప్రజా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది కుట్రపూరితంగా దుర్మార్గమైన దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఉద్యోగులు అధైర్య పడదు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కుట్రపూరితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
రాష్ట్రంలో సంపాద సృష్టించే రంగాలను అభివృద్ధి చేసుకొని జిడిపి ని పెంచుకొని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది.ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్తూనే పరిశ్రమలను తీసుకువచ్చి ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
అత్యంత వెనుకబడి ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా పారిశ్రామికీకరణ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర అభివృద్ధి కోసం డీటెయిల్ ప్రోగ్రాంతో ముందుకు వెళుతున్నది.
పరిశ్రమలు ఏర్పాటుకు భూములు కావలసిన విషయం అందరికీ తెలిసిందే భూములు కొలిపే రైతుల బాధలు ఏంటో మాకు తెలుసు. రైతుల బాధను ఇందిరమ్మ రాజ్యం సంపూర్ణంగా అర్థం చేసుకుంటుంది. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమంలో పనిచేయడానికి నిరుద్యోగులకు కావాల్సిన కిల్స్ విషయంలో తర్ఫీదు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని బిఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. లగచర్లలో దళిత గిరిజన రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది బి ఆర్ ఎస్ చూస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా అమాయకులైన పేద బడుగు బలహీన వర్గాల యువతను రెచ్చగొట్టి వారు ప్రాణాలు కోల్పోయేలా చేశారు. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళీ అదే విధంగా అమాయక దళిత గిరిజ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు ఉద్యోగాలు పరిశ్రమలు కావాలని కోరుకుంటున్నారు. అవి ప్రజలకు రావడం మీకే ఇష్టం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ప్రజా ప్రభుత్వం ఉద్దేశం, లక్ష్యం. అందులో భాగమే రీజనల్ రింగ్ రోడ్- ఔటర్ రింగ్ రోడ్ మధ్యన పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం.
కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావులు తలకిందులు తపస్సు చేసిన ప్రజా ప్రభుత్వాన్ని అస్తిరపరచలేరు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకుండు. ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలతో ఒప్పందం కుదిరిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పడం అంటే బిజెపికి ఓటు వేయమని చెప్పడమే.
రాష్ట్ర గవర్నర్ పై మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తాం.