Suryaa.co.in

National Telangana

ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరు

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల & కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం తరఫున గౌరవ ఉప ముఖ్య మంత్రి & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ము షరఫ్ ఫరూఖీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సంబంధిత అంశాలను చర్చించారు.

LEAVE A RESPONSE