– మీరు కూడా గురుకులాలు సందర్శించాలి
– ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తక్కువ అవుతున్న మాట వాస్తవం
– శాసన మండలి లో గురుకులాల పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు
హైదరాబాద్: తెలంగాణ లోని గురుకుల పాఠశాలల పై చర్చ జరిగింది. గురుకులాలు ప్రారంభించాం అని చెప్పారు. 327 బీసీ గురుకులాలు ఉంటే 21 సొంత భవనాలు ఉంటే మిగిలినవి ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. దసరా సెలవుల అనంతరం గురుకులాలకు తాళాలు వేస్తే, విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వంతో మాట్లాడి 50 శాతం అద్దెలు చెల్లించి మౌలిక వసతులు కల్పించాలని చెప్పాం.
కరీంనగర్ జిల్లాలో 33 బీసీ గురుకులాలు ఉంటే ఒక్కటే ప్రభుత్వ భవనం ఉంది..మిగిలినవి ప్రైవేట్ ఉన్నాయి. అక్కడ 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న వారు కనీసం భవనాలు నిర్మించలేకపోయారు. గతంలో ఇంజనీరింగ్ కాలేజీ లలో, షెడ్లలో గురుకులాలు ఏర్పాటు చేశారు. సభ్యుల సలహాలు ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రభుత్వ పరంగా ఇన్ని చర్యలు తీసుకుంటున్న ఫుడ్ పాయిజన్ కేసులు ఎందుకు జరుగుతున్నాయని ఆందోళన ఉంది.
ఫుడ్ కమిటీ లు వేసాం.ఎక్కడైనా ఏ తప్పు జరిగినా అధికారులదే బాధ్యత. జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో ముఖ్యమంత్రి కచ్చితంగా గురుకులాలు పరిశీలించాలని, నెలలో ఎన్ని గురుకులాలు తిరిగారు అని వారి షెడ్యూల్ పరిశీలిస్తామని చెప్పారు. రాజకీయ విమర్శలు కాదు. మీరు కూడా గురుకులాలు సందర్శించాలి.
ప్రభుత్వం అన్ని గురుకులాల్లో కామన్ డైట్ ఏర్పాటు చేశాం. నిపుణుల ఆధ్వర్యంలో గురుకులాలు డైట్ మెనూ ఏర్పాటు చేశాం. 40 శాతం డైట్ చార్జీలు పెంచాం. అడ్మిషన్లు పూర్తి చేశాం. ప్రభుత్వం 216 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్ లో అడ్మిషన్ ప్రక్రియ లో కాంపిటీషన్ చాలా ఉంది.
పెద్దాపూర్ గురుకుల లో పాము కాదు. ఇంకా ఏం జరిగిందో తెలియదు. అస్వస్థతకు గురయ్యారు. నిఖిల్ హాస్పిటల్ లో ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స పొందుతున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు పిల్లలాగా చూసుకోవాలి. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాం. ఇంకా మీ నియోజకవర్గాల్లో బాత్రూమ్ , వంట గదులు ,ఎలక్ట్రిసిటీ ఇతర మౌలిక సదుపాయాలు లేకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రతి సంవత్సరం గురుకులాల మీద సమీక్ష చేసుకుందాం.
గురుకులాలు విద్యార్థుల మీద రాజకీయాలు వద్దు. ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తక్కువ అవుతున్న మాట వాస్తవం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి అంటే నామోషీ అనే పదం తొలగించినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. అందరి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతారు. రాజకీయ నాయకులే కాదు. అధికారులు కూడా ప్రైవేట్ లో చదివిస్తున్నారు. 2023-24 లో 18 లక్షల మంది విద్యార్థులు ఉంటే, అంతకు ముందు 20 లక్షల మంది ఉన్నారు. టీచింగ్ స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నో పరీక్షలు పాస్ అయి వచ్చారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ వృత్తిని మీరు సగర్వంగా నిర్వహించాలి. మీ పిల్లలగా చూసుకోవాలి. మొత్తం 250 ళ్లలో 25 ఎకరాల స్థలంలో 150-200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నాము. బలహీన వర్గాల నుండి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల గొంతుగా ప్రభుత్వంలో వినిపిస్తున్న. 8 లక్షల మంది పిల్లలకు మార్గదర్శకత్వంగా ఉండాలి. సప్లై చేసే వారు కూడా పారదర్శకంగా ఉండాలి.
2004-14 మధ్య గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ చార్జీలు ఉండేవి. కానీ గత ప్రభుత్వం లో గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు బంద్ చేశారు .అందుకే ఇబ్బందులు వచ్చాయి. మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మెస్ ఛార్జీలు,అద్దె భవనాల అద్దెలు ప్రతి నెల 10 వ తేది లోపు చెల్లించాలని భావిస్తున్నాం. అన్ని గురుకులాల్లో క్రీడా సామాగ్రి , మందులు అన్ని సరఫరా చేస్తున్నాం.