-వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన జగన్ లంచాలు తీసుకోవడం నేరమని మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్
– జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే తప్ప ఆచరణలో శూన్యం
– మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు
వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ గా మిగిలిపోతుంది. జగన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నాడు. ఇప్పుడు దోచుకుంటున్నారు. దోచుకున్న డబ్బంతా జగన్ రెడ్డి ఎక్కడ దాచుకున్నాడో చెప్పాలి. క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి లంచాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పైతే జగన్ రెడ్డి క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా?
జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయింది. ఆచరణలో ఏ ఒక్క సామాజిక వర్గానికి జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారు. జగన్ రెడ్డి చెబుతున్నట్లు సామాజిక న్యాయం జరిగితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MDPI)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఎందుకుంది? గినీ ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు ఎగబాకింది. ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు పడిపోయిందో జగన్ రెడ్డి చెప్పగలడా?
జగన్ మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుంది. బలహీన వర్గాలకు విద్యనందిచడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడంతో కాలేజీల్లో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన NAS (National Achievement Survey) సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైంది. కరోనా సమయంలో దాదాపు 50 శాతం మంది పిల్లలకు వర్చువల్ క్లాసులు ద్వారా విద్యనందించడంలో ఏపీ వెనబడిందని రిపోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతం కు పైగా బడుగు, బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. జగన్ మోసపురెడ్డి విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది.
తలసరి ఆదాయం(స్థిరధరల ప్రకారం) టిడిపి హయాంలో రెండంకెల్లో ఉంటే, వైసిపి మూడేళ్లలో సింగిల్ డిజిట్(1.03%)కు పతనమైంది. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయింది. స్థిరధరల ప్రకారం జి.ఎస్.డి.పి టిడిపి ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే, వైసిపి పాలనలో నెగటివ్ గ్రోత్(మైనస్ 2.58)కు దిగజార్చారు. ధరలు పెరగడంతో కడుపు నిండా భోజనం చేయడానికి కూడా ప్రజల వద్ద డబ్బు లేదు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకుల ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ ప్రజల ఆదాయాలను పూర్తిగా పడిపోయాయి. జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం ఇదేనా? రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీయడానికి జగన్ రెడ్డి అసమర్ధత, చేతగానితనమే కారణం.
యువతకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పుడు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది. ఉపాధి హామీ పని దినాలను 25 శాతం తగ్గించారు. కేంద్రప్రభుత్వ పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నింటిని నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారో ఎవరీకి తెలియదు. ఈ వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఏదాడికి దాదాపు రూ. 57 వేల కోట్ల రూపాయాలను దారిమళ్లించి ఈ వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు. అప్పుల భారం, టాక్సుల భారం పేదవారిపై మోపడమేనా జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం.
మహానాడు ఘనవిజయం సాధించడంతో వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుంది. మహానాడుకు పోటీగా బస్సుయాత్ర చేయాలనుకున్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లు సంపాధించుకున్న జగన్ రెడ్డి బస్సు యాత్రతో ప్రజల నమ్మకం పోగుట్టుకున్నాని తెలుసుకున్నాడు. దావోస్ పర్యటనతో ఎపికి ఒరగబెట్టింది ఏంటో చెబుతారని ఆశించిన ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు లంచం అంశం మీద జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.