– బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు పురుగులు, దోడ్డు బియ్యం తో అన్నం పెట్టారు. జెండా మారింది ముఖ్యమంత్రి మారారు. అధికారులు వాళ్లే ఉన్నారు. 49 మంది పిల్లలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చనిపోయారు. ఇంత మంది చనిపోతే ముఖ్యమంత్రి ,మంత్రులు చనిపోయిన ప్రభుత్వంలో చలనం లేదు.
పిల్లల చావులకు కారణం ముఖ్యమంత్రి ,కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ చేసిన హత్యలుగా మేము భావిస్తున్నాం. బయటి ఫుడ్ తినడం వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయ్యిందని కలెక్టర్,లోకల్ ఎమ్మెల్యే అంటున్నారు. విద్యార్థులు ఏమో మేము బయటకి వెళ్లలేదు. ఎక్కడ ఏమి తినలేదని చెబుతున్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే ప్రభుత్వం అప్పుడు స్పందిస్తుంది. గత ప్రభుత్వంలో పెట్టిన ఫుడ్ కూడా పెట్టడం లేదు. విద్యాశాఖ, శాంతి భద్రతలు చూడటానికి మంత్రి లేడు..ముఖ్యమంత్రి వద్ద ఉన్నా ఎందుకు స్పందించడం లేదు?