Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి తక్షణమే హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

• తనపార్టీనేతల కబంధహస్తాల్లో చిక్కి విశాఖనగరం విలవిల్లాడుతున్నా, జగన్ రెడ్డి స్పందించడా?
• విజయసాయి, ఎంపీఎంవీవీ, ఇతర వైసీపీనేతల భూదందాలపై ముఖ్యమంత్రి తక్షణమే హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
• తాను ఏతప్పుచేయలేదు, తనపై ఏవిచారణ జరిపినా ఇబ్బంది లేదని విజయసాయిరెడ్డే చెప్పాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు తటపటాయిస్తున్నాడు?
• బొండా ఉమామహేశ్వరరావు

విశాఖనగరాన్ని క్రైమ్, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చిన విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ ఎంవీవీ.సత్యనారాయణ, ఇతరనేతలు రాబందుల్లా ఆప్రాంతంపై పడి విలువైన భూము ల్ని కబ్జాచేస్తూ, భూయజమానుల్ని రాబందుల్లా పీక్కుతింటున్నా జగన్ రెడ్డి ఎందుకు వారిపై చర్యలకు వెనకాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు నిలదీశారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!

“తనపార్టీముఖ్యనేతలు, వైసీపీచెంచాలు ముఖ్యమంత్రి అండదండలతోనే విశాఖకేంద్రంగా భూదందాలకు తెరలేపారని ప్రజలంతా భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి దసపల్లా భూములుసహా, ఇతరవిలువైన భూముల్ని కొట్టేసినా, కూర్మన్నపాలెంలోని స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ, రూ.500కోట్లవిలువైన మధురవాడ ఎన్సీసీ భూముల్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తమ్ముడు కాజేశాడు. వాటితోపాటు వైసీపీనేతలు కొట్టేసిన భూముల జాబితా కొండవీటిచాంతాడంత ఉంది. డేటా సెంటర్ కు గతప్రభుత్వం కేటాయించిన రూ.600కోట్ల భూమిని, హయగ్రీవా వృద్ధాశ్రమానికి చెందిన రూ.400కోట్లభూమిని దిగమింగారు. బేపార్క్, రాడిసన్ హోటల్, భీమిలి బీచ్ రోడ్ లోని నేరెళ్లవలసలోని రూ.100కోట్ల భూమికబ్జాకు గురైంది. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలుసహా, బడులు, గుడులు సహా వేటినీ వైసీపీ భూమాఫియా వదలడంలేదు. ఈవిధంగా లెక్కకుమిక్కిలిగా సాగుతున్న భూకబ్జాలపై జగన్ రెడ్డి ఎందుకు నోరువిప్పడంలేదు. తనపార్టీవారిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నాడు. విశాఖనగరాన్ని, ఉత్తరాంధ్రను పూర్తిగా దోచేసి, కనుమరుగు చేసేవరకు ముఖ్యమంత్రి చూస్తూఊరుకుంటాడా? వైసీపీ భూమాఫియాతో విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతం వణికిపోతోంది. రోజురోజుకీ పేట్రేగిపోతున్న విశాఖభూమాఫియా దందాలు జగన్ రెడ్డికి కనిపించడం లేదా?

భూదందాలపై మీడియా కోడైకూస్తున్నా… ప్రధానప్రతిపక్షం గొంతుచించుకుంటున్నా జగన్ రెడ్డి ఎందుకు చలించడంలేదు?
జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధిఉంటే, విశాఖనగరాన్ని కాపాడాలని, అక్కడిప్రజలకు అండగా నిలవాలనిఉంటే, తక్షణమే తనపార్టీనేతల భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖకేంద్రంగా సాగుతున్న భూదోపిడీపై మీడియా కోడైకూస్తున్నా, ప్రధానప్రతిపక్షమైన తాము ఆధారాలతోసహా బయటపెడుతున్నా జగన్ రెడ్డి ఎందుకు చలించడంలేదని ప్రశ్నిస్తున్నాం. తానుఏతప్పు చేయలేదని, ఎలాంటి విచారణ జరిపినా అందుకుసిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి సొల్లుకబుర్లు చెప్పాడు. ఆయనే స్వయంగా తనపై విచారణకోరడంలేదో సమాధానం చెప్పాలి. చంద్రబాబుగారి హయాంలో ఆర్థికరాజధానిగా విశాఖనగరం విరాజిల్లితే, వైసీపీప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే రూ.40వేలకోట్లపైచిలుకు భూములు కొట్టేశారు. ఇంత జరుగుతున్నా విశాఖనగరంలోని మేథావులు, ప్రజాసంఘాలు ఎందుకు స్పందించడంలేదు?

లోపాయికారీగా రూ.40వేలకోట్లవిలువైన భూములుకొట్టేసిన సంఘటనలను విశాఖనగర చరిత్రలో ఎన్నడైనా జరిగాయా అన్న ఆలోచన ఆప్రాంతప్రజలు, మేథావులు ఆలోచించాలి. వైసీపీనేతలు, విజయసాయిరెడ్డి లాంటి పెద్దతలకాయలు విశాఖనగరంపై పడి, కనపడిన భూమినల్లా స్వాహాచేస్తున్నాకూడా ప్రభుత్వాధినేతలో స్పందనలేకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి తన అనుకూలమీడియాముందు కట్టుకథలు చెప్పి, ప్రజల్ని నమ్మించడం కాకుండా, తక్షణమే విశాఖకేంద్రంగా సాగుతున్న భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలి” అని బొండా ఉమా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE