– జగన్ అంటే నమ్మకం
– ‘జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం’ పుస్తక ఆవిష్కరణలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దొంతి రెడ్డి వేమారెడ్డి అన్నారు. సోమవారం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం కాల వ్యవధిలో జరిగిన హత్యలు – అఘాయిత్యాలు – ఆకృత్యాలు -పెరిగిపోయాయని అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వలన రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు. అందువలన జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనవైఫల్యాలను , మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతుందని ఆరోపించారు. వైసీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండలం రూరల్ అధ్యక్షుడు తాడిబోయిన శివగోపయ్య, మంగళగిరి మండలం అధ్యక్షుడు నాలివెంకట కృష్ణ, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ ,తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు బొక్కా అగస్టీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మేడ వెంకటేశ్వరరావు, నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కట్టె పోగు నాగభూషణం, బిసి సెల్ నియోజకవర్గ విభాగ అధ్యక్షులు తాడి బోయిన సుబ్బారావు, వైయస్సార్ ట్రేడియన్ అధ్యక్షులు శ్రీనివాసు రాజు, మున్సిపల్ విభాగం అధ్యక్షులు సుబ్బురావు, సోషల్ మీడియా నియోజవర్గ విభాగ అధ్యక్షులు భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.