Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్

– రేవంత్ రెడ్డి బావమరది సృజన్ రెడ్డి పై విచారణ ఉండదు
– తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ (విసిసి) మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్. అవినీతితో, అక్రమాలతో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎదిగిన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారే పెద్ద అవినీతి పరుడు. రేవంత్ రెడ్డి పై దాదాపుగా 89 కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏసీబీ నోటీసులు ఉన్నాయి, ఈడీ నోటీసులు ఉన్నాయి, జైలుకు వెళ్ళిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ తను అనుభవించాడు కాబట్టి మీరు కూడా అనుభవించండి అని వ్యక్తిగత కక్షతో చేస్తున్న చర్యలు మాత్రమే, అవినీతి అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సృష్టి.

ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోలేదు. అందులో ఇసుమంత కూడా కరప్షన్ లేదు. జరిగిన లావాదేవీలన్నీ ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం స్పష్టంగా ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా కావాలని కక్షపూరితంగా చేస్తున్న పనికిమాలిన చర్య.

అమృత్ పథక టెండర్లలో రేవంత్ రెడ్డి బావమరది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా ఇచ్చిన కాంట్రాక్టు లపై జరిగిన దుర్వినియోగం పై విచారణ కోసం కేటీఆర్ స్వయంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెళ్లినా అక్కడ కేంద్రం పట్టించుకోదు. ఇక్కడున్న బిజెపి నాయకులు మాట్లాడరు.
దానిపై విచారణ ఉండదు? నోటీసులు ఇవ్వరు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సుంకిశాల ప్రాజెక్టు కూలినా నో ఎంక్వయిరీ. వట్టేం పంప్ హౌస్ మునిగిపోయినా నో ఎంక్వయిరీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు మృతిచెందిన ఇంకా ఏడుగురు జాడ తెలువకున్న దానిపై నో ఎంక్వయిరీ? ఎవరికి నోటీసులు ఉండవు? ఎవరిపై విచారణలు ఉండవు.

నిన్న కాళేశ్వరం విచారణ.. నేడు మళ్ళీ ఏసీబీ విచారణ… రేపు మల్లొకటైనా ఇంకే విచారణ అయిన మేము బెదిరేది లేదు భయపడేది లేదు. మీరిచ్చిన
6 గ్యారంటీలు,420 హామీలు అమలయ్యే వరకు మిమ్మల్ని నిలదీస్తూనే, వెంబడిస్తూనే ఉంటాం.

LEAVE A RESPONSE