ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులకు కొలీజియం సిఫార్సు

Spread the love

ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం మూడు రాష్ట్రాల్లోని 14 మంది న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

వీరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు, మధ్యప్రదేశ్కు ముగ్గురు, ఒడిశాకు నలుగురి పేర్లను సిఫారసు చేసింది. ఈనెల 29న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం… 14 మంది న్యాయవాదులు, ముగ్గురు జుడిషియల్‌ అధికారులను హైకోర్టు న్యాయవాదులుగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది. మధ్యప్రదేశ్‌లో ముగ్గురు జుడిషియల్‌ అధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది.ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ బండారిని మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించిన సుప్రీంకోర్టు.. వారి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. జడ్జిలుగా పదోన్నతి పొందిన న్యాయవాదుల్లో… కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. రామకృష్ణ ప్రసాద్‌ గత 25 ఏళ్లుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Leave a Reply