Suryaa.co.in

Political News

బీజేపీ- ఆరెస్సెస్ అనుకున్నంతగా దేశం- సమాజం గుడ్డివి,అమాయకమైనవి కాదు కదా?

ఓపక్క బీజేపీ ప్రాతీయ అవినీతి వారసత్వ బందిపోటు దోపిడీదొంగలతో దోస్తీ, రాజకీయ ఆర్ధిక దొంగలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, పట్టపగలే బహిరంగంగా లక్షలకోట్ల దోపిడీలో వందలాది ఆధారాలున్నా కూడా వాళ్ళ మీద ఈగకూడా వాలనీయకుండా గత ఎనిమిదేళ్లుగా ఒక్క ఈడీ కేసుకూడా దాఖలు చేయని పరిస్థితి, వాళ్ళ మీద నడుస్తున్న తీవ్ర ఆర్థికనేరాల కేసులు న్యాయస్థానాల్లో ముందుకు నడవని పరిస్థితి.
బయటకు మాత్రం వాళ్ళ మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నట్లు వాళ్ళు తిట్టుకుంటున్నట్లు నటన, వంచన. మరోపక్క, ఏనాడో జరిగిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక బ్లాక్ మెయిలర్ రాజకీయ తారుపుడుగాడు వ్రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదుచేసి ఎటువంటి ప్రత్యక్ష సంబంధంలేని రాహుల్ గాంధీని ఐదురోజులుగా రోజుకు పన్నెండు గంటలపాటు ఈడీ ప్రశ్నించడం.

ఇది దేనికి సంకేతం?
నిజంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సంబంధం ఉంటే ఆధారాలుంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే, అదేసమయంలో దేశంలో అధికారం అడ్డంపెట్టుకుని దోచేస్తున్న మిగిలిన అనేకమంది రాజకీయ తిమింగళాలు అవినీతిపరులు విషయంలో వాళ్ళ మీద ఈడీ కాదుకదా ఈగ కూడా వాలనీయకుండా, కోర్టుల్లో కేసులు ముందుకు కొనసాగనీయకుండా బీజేపీ ప్రభుత్వం మౌనం ఎందుకో..?

రాజకీయంగా ఆర్ధికంగా రాజ్యాంగపరంగా అన్నివిధాలా దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా దేశం పరువుప్రతిష్ఠలు మంటగలుపుతున్న మోడీ ప్రభుత్వం. గత ఎనిమిదేళ్లుగా కొన్ని ఆఫ్రికా దేశాలతో పోటీపడుతూ దేశాన్ని సమాజాన్ని అనాగరికంవైపు ఆరాచకంవైపు నడిపిస్తున్న మోడీ. ఇది నిన్న రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రపంచానికి తేటతెల్లం అయ్యింది. అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం కూడా చేరాలంటే అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనేటప్పుడు ఆ దేశాల అధ్యక్షులు ప్రధానులు ఎవరో? వాళ్ళ విద్యార్హతలు ఏమిటో? వాళ్ళ వ్యక్తిత్వాలు భాష ప్రసంగిచే తీరు ఏపాటివో అంతర్జాతీయ మేధావులు సాంఘీక శాస్త్రవేత్తలు అంచనావేస్తారు లెక్కగడతారు. కీశే. అబ్దుల కలాం తరువాత మనదేశం అంతర్జాతీయ వేదికలపై అధోగతిస్థాయికి చేరిందనే చెప్పాలి, అది నేడు పరిపూర్ణంగా అధమస్థాయికి చేరిందని అంతర్జాతీయ ఆర్థిక సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మనం గనక ఒకటి గమనిస్తే, గత ఎనిమిదేళ్లుగా మోడీ ప్రభుత్వం ఉన్నతస్థానం పొందటానికి ఉన్నతంగా ఆలోచించకుండా ప్రయత్నించకుండా, అన్ని ప్రధాన వ్యవస్థల్లో అన్నిరకాలుగా అధమస్థాయికి చేరడానికి పోటీపడుతోంది అని తటస్తులు కూడా రుజువులు సాక్ష్యాలతో ఘంటాపథంగా చెప్పవచ్చు. నిజంగానే బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు మంచి అవకాశాలు ఇవ్వదలిస్తే ఆదివాసీల్లో కూడా కీశే అబ్దుల్ కలాం లాంతో గొప్పగొప్ప పేరుగాంచిన స్కాలర్లు మేధావులు ఎందరో ఉన్నారు, వాళ్లకు ఉన్నతమైన అవకాశాలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో మన దేశంలో కూడా ఆదివాసీలు/ట్రైబల్స్ లో గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు, అలాచేస్తే బీజేపీ ప్రతిష్ట ఆదివాసీల్లోనూ మిగిలిన అణగారిన వర్గాల్లో మరింతగా పెరిగేది, కానీ నేడు చేస్తున్నది చేసింది ఏమిటో బీజేపీ ఆరెస్సెస్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

~సువేరా

LEAVE A RESPONSE