– భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి
మెడికల్ విద్యార్థి ప్రీతి మరణం పై న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మెడికో సైకో విద్యార్థి సైఫ్ కి ఉరిశిక్ష విధించాలని మేకల సారంగపాణి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సోయి లేకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎన్ని అకృత్యాలు జరిగినా కూడా కేసీఆర్ నిద్రమత్తులోని తూలుతున్నాడని, అసలు హోం మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేదో తెలియదని, ఈ పాసిస్టు ప్రభుత్వానికి మహిళలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ప్రీతి కుటుంబానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఉంటుందని ఆమెకు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాము.