Suryaa.co.in

Andhra Pradesh

పిఎఫ్‌ఐ ఎస్‌డిపిఐలకు సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయండి

– భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ)లకు సహకరిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ద్రోహులకు రక్షణ కల్పించి రాష్ట్రానికి పెనుముప్పును తెచ్చినట్లు ఆరోపించింది. అలాగే సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆరోగ్య విజ్ఞాన వర్శిటీకి పేరు మార్చినట్లు విమర్శించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌బాజీ, రాష్ట్ర నాయకులు పాల శ్రీనివాస్‌లతో కలసి గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.

ఓటు బ్యాంకు రాజకీయాలతో ద్రోహులకు రక్షణ
` విద్రోహ సంస్థలైన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ) కార్యకలాపాలు ఎపీ, తెలంగణాల్లో పెరిగిపోవడానికి కారణం రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలే. రెండు తెలుగు రాష్ట్రాలను ఈ సంస్థలు ప్రధాన షెల్టర్‌గా వాడుకుంటున్నాయి. ఈ సంస్థల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిఘా పెట్టలేదు.ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా మంత్రులు, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు నేరుగా పిఎఫ్‌ఐ, ఎస్‌డీపిఐలకు సహకరిస్తున్నారు. వీరు ఉగ్రవాద శిక్షణ తీసుకుని స్వయంగా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి తగులబెట్టి పోలీసులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పినా ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయపట్టలేదు ? అధికారులను వేరే జిల్లాలకు బదిలీ చేశారు.

స్వయంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాషా, స్ధానిక ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సంఘటనా స్థలానికి వచ్చి నిందితులపై చర్యలు తీసుకోవద్దని పోలీసులపై వత్తిడి చేశారు. గుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన వారిపై కూడా వైకాపా ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. రాయచోటిలోనూ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసిన వారిపై కేసులను ఎత్తేశారు. పెద్ద సభలు పెట్టి సన్మానాలు చేశారు. ఏపీలో నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారు?ఓటు బ్యాంకు కోసం దేశ భద్రత, శాంతిభద్రతలను వైకాపా, తెరాస ప్రభుత్వాలు పణంగా పెడుతున్నాయి. ` పిఎఫ్‌ఐ, ఎస్‌డిపిఐకు సహకరిస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయాల్సిందే.

సమస్యలు పక్కదారి పట్టించేందుకే పేర్లు మార్పు
వైకాపా ప్రభుత్వం పాలనను రాజరికంగా భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను భజన సంకీర్తన వేదికగా మార్చింది.ఉన్న సమస్యలను పరిష్కారించక ప్రజల దృష్టి మళ్లించేందుకు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. ఆరోగ్యవిశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్‌టీఆర్‌ పేరును దురుద్దేశంతో మార్చారు. నరేంద్రమోదీలా ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. పేర్లు మార్చికాదు.కేంద్రం బోధనాసుపత్రులు ఎపీకి ఇస్తే అవి మావే అని ప్రచారం చేసుకున్నారు. కేంద్ర వైద్యశాఖ మంత్రి భారతిగారి దృష్టి మరలించేందుకు మచిలిపట్నంలో ఆసుపత్రికి రెండు రకాల బోర్డులు పెట్టారు.

`వైకాపా స్టిక్కర్ల పార్టీ…స్టిక్కర్ల ప్రభుత్వం
` భాజపా ఢల్లీిలో 30 ఔరంగజేబు వీధిపేరు మార్చి, దేశభక్తుడైన అబ్దుల్‌ కలాం పేరు పెట్టింది. ప్రజలు దీనిని హర్షించారు.మీకు చిత్తశుద్ది ఉంటే గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చి అబ్దుల్‌కలాం, లేదా అల్లూరి పేరు పెట్టాలి.విశాఖలో మన సంపదను కొల్లగొట్టిన బ్రిటిషర్‌ కింగ్‌జార్జి ఆసుపత్రి పేరును మార్చి అల్లూరి పేరు పెట్టాలి.కేంద్రం నిధులిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ప్రపంచ నాయకుడైన వాజ్‌పేయి పేరు పెట్టాలి.మీ పేర్లు పెట్టుకోడానికి అవేమీ మీ సొంత ఆస్తులు కాదు. ప్రజలు ఓట్లేసింది మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోడానికి కాదు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలపై భాజపా చేస్తున్న ప్రజాపోరు వీధి సమావేశాల్లో వస్తున్న స్పందనతో అందరి దృష్టి మళి ్లంచేందు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చే డ్రామాప్రారంభించింది. వైకాపా అడే రాజకీయ క్రీడలో విపక్షాలు పడొద్దు.కుటుంబ, కుల, వారసత్వ ప్రాంతీయ పార్టీలకు ఓట్ల రాజకీయాలే కావాలి. అభివృద్ధి అవసరం లేదు.

వైకాపా ఎమ్మెల్యేలు రాజరిక వ్యవస్థలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. వైకాపా ఎపీని ఒక ప్రత్యేక రాజ్యంగా భావిస్తోంది. ఎపీ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. స్వాతంత్య్ర పోరాటం చేసి, బలిదానాలు, త్యాగాలు చేసిన చరిత్ర ఎపీది. చరిత్ర మరచిపోవద్దు. ప్రజాస్వామ్య విలువలు గుర్తించి పాలించాలి.

LEAVE A RESPONSE