Suryaa.co.in

Telangana

దేశంలో అభివృధ్ధి రంకెలు వేస్తుంది

-తెలంగాణ గాంధీగా ఉండాలనుకున్న కేసీఆర్ పదేళ్లకే ఖతం
-బీఆర్ఎస్ పార్టీ ఉంటదో ఉండదో తెలియని పరిస్థితి
-కేసీఆర్ తన కుటుంబం బాగు కోరుకుంటే..మోదీ దేశ ప్రజల బాగు కోరుకుంటారు
– మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

విజయ సంకల్ప యాత్ర..విజయాన్ని కాంక్షిస్తున్నది యావత్ 140 కోట్ల భరతమాత ముద్దుబిడ్డలు. మోదీ తో నాకున్న పరిచయం కేవలం మూడు సంవత్సరాలే..నేను కలిసింది కూడా మూడు సార్లే. మోదీ మాటలు విన్న తర్వాత ఇంత గొప్పగా ఆలోచిస్తడు కాబట్టే ఇలా ఎదిగారని అనిపించింది.

విద్యార్థులు, మహిళలు మా ఓట్లు మోదీ కే అని అంటున్నారు.. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా గౌరవంతో ఉంటున్నారంటే నరేంద్ర మోదీ కారణం. దేశంలో అభివృధ్ధి రంకెలు వేస్తుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకున్నం.

గల్ఫ్ దేశాల్లో కూడా హిందూ దేవాలయాలను నిర్మాణం చేసి ప్రపంచానికి అంకితం చేసిన ఘనత నరేంద్ర మోదీ దే. పేద ఇంట్లో పుట్టిన బిడ్డ కాబట్టే దేశంలో 12 కోట్ల ఇండ్లల్లో టాయిలెట్ల నిర్మాణం చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడారు. కరోనా కష్ట కాల సమయంలో పేద ప్రజలకు వ్యాక్సిన్లు అందించారు. ప్రపంచమంతా కరోనా సమయంలో అల్లాడుతుంటే ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించారు.

భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది… దేశ ఆర్థిక వ్యవస్థను మూడవ స్థానంలో నిలబెట్డడమే నరేంద్ర మోదీ లక్ష్యం. తెలంగాణ గాంధీగా ఉండాలనుకున్న కేసీఆర్ పదేళ్లకే ఖతం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటదో ఉండదో తెలియని పరిస్థితి.

నా కుటుంబమే తెలంగాణ ప్రజలు అని చెప్పిండు… తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ పాలన చేశారు. మోదీ ని తిట్టిన వ్యక్తులే ఢిల్లీ పోదాం అంటుర్రు. 273 స్థానాలతో మొదటిసారి..303 స్థానాల్లో రెండవసారి మోదీ ప్రభుత్వం ఏర్పడింది. 370 సీట్లతో మూడవ సారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల హృదయాల్లో మోదీ చోటు సంపాదించుకున్నారు.

ఎప్పుడు కూడా మోదీ చేసిన పనులు చెప్పుకోలేదు..చెప్పడు కూడా. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కి తన కుటుంబం బాగు కోరుకుంటే..మోదీ దేశ ప్రజల బాగు కోరుకుంటారు. కేసీఆర్ మీద వ్యతిరేకతతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలివ్వలేని పరిస్థితి…లక్ష రుణమాఫీ కూడా చేయలేదు.

2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదా? వచ్చే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ కోసం జరిగే ఎన్నికలు కావు.. దేశ ప్రజల కోసం జరిగే ఎన్నికలు. ప్రపంచ దేశాల భారతదేశ గౌరవాన్ని మోదీ గారు ఇనుమడింప చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నరేంద్రమోదీ ని ఆశీర్వదించండి. తెలంగాణలో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేద్దాం

LEAVE A RESPONSE