దేశానికి దిశా నిర్దేశం… నవ శకానికి నాంది…భారత్ రాష్ట్ర సమితి

-తెలంగాణ మోడలే దేశానికి దిక్సూచి…
-కేసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష…
-రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎప్పటికైనా దేశానికి దిశా నిర్దేశం… చేసేది, నవ శకానికి నాంది…పలికేది భారత్ రాష్ట్ర సమితి మాత్రమే. దేశంలో ఇప్పటివరకు అధికారం లోకి వచ్చిన అన్ని పార్టీలు ప్రజా రంజకంగా పాలించడంలో విఫలమయ్యాయి. ప్రత్యేకించి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మత విద్వేష వైషమ్యాలను రెచ్చగొట్టి, ప్రజలను విడదీసి పరిపాలన చేస్తున్నది. ఈ దశలో ప్రజలు లౌకిక, ప్రజాస్వామిక, పరిపాలనా దక్షుడు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదే తరుణంలో గొప్ప పరిపాలన అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ తెలంగాణ ను అంటి కాలంలోనే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించారు. ఇవ్వాళ దేశం మొత్తం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నది. తెలంగాణ అభివృద్ధి మోడల్ గొప్ప దార్శనికత తో కూడుకున్నది. ఇక తెలంగాణ మోడలే దేశానికి దిక్సూచి…కేసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష.

ఉద్యమ నాయకుడు కేసిఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీ గా మొదలై, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశంలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించింది. కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి.. తెచ్చుకున్న కొత్త రాష్ట్రం ఆనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతు బంధు, రైతు భీమా, 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, సబ్బండ వర్గాల సంక్షేమం లాంటి ఎన్నో సంస్కరణల పథకాలతో తెలంగాణను ఉద్యమంగా అభివృద్ధి చేశారు.

అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంగా చేపట్టి, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నారు. కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా ఇదే తరహా అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని దేశ ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. కేసిఆర్ ని దేశ రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ, నిత్యావసరాల ధరలు పెంచుతూ, ప్రజా స్వామ్యాన్ని పరిహసిస్తూ, సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తూ, చేస్తున్న పాలన ప్రజలకు విసుగు తెప్పిస్తున్నది.

కేసిఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ దేశ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ “భారత్ రాష్ట్ర సమితి” తో దేశ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు కేసిఆర్కి ఉంటుంది. కచ్చితంగా బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. భారత దేశ దిశా దశ మార్చే సత్తా కేవలం కేసిఆర్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎప్పటికైనా దేశానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష.”

Leave a Reply