Suryaa.co.in

Andhra Pradesh

కియా రాకతో పెరిగిన గ్రామాల ఆర్థిక పురోభివృద్ధి

– చంద్రబాబు సహకారంతో ఈ ప్రాంత రూపురేఖలు మారాయి,ఉపాధి అవకాశాలు పెరిగాయి
– అంగన్వాడి నూతన భవన నిర్మానానికి భూమి పూజ చేసిన మంత్రి సవిత

పెనుకొండ : కియా కంపెనీ రాకతో ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు.వచ్చాయని మంత్రి సవితమ్మ తెలియచేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం దుద్దెబండ పంచాయతీలో కీయా కంపెనీ నుండి సి ఎస్ ఆర్ నిధులతో అంగన్వాడి భవన నిర్మాణం కు మంత్రి సవిత భూమి పూజ చేసిన చేశారు.

అనంతరం అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కృషితో కీయా ప్రతినిధులు తో సంప్రదింపులు జరిపి కియా కంపెనీ పెనుకొండ తీసుకొచ్చారని వాటి ద్వారా వేలాదిమందికి , ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి పొందగలుగుతున్నారని , గతంలో ఎకరం 10 లక్షల ఉన్న భూమి విలువ ఇప్పుడు రెండు ,మూడు కోట్లు ధర పలుకుతూ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు ని మంత్రి సవిత తెలియజేశారు.

నంతరం రిజర్వాయర్ నుండి గొల్లపల్లి గ్రామం వరకు 1 కోటి 60 లక్షలతో జరుగుతున్న సిసి రోడ్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సవిత, అనంతరం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కు నీరు వస్తుండడంతో జలహారతి చేశారు.

LEAVE A RESPONSE