ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో ఎంపీఓ ల కృషి ఎంతో ఉంది

Spread the love

ఎంపీఓ ల సంఘం డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ ఉద్యమం తో పాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు తేవడంలో ఎంపీఓ ల పాత్ర, కృషి ఎంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఇవ్వాళ మన గ్రామాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచి, అనేక అవార్డులు రావడంలోనూ ఎంపీఓ ల కృషి ని మరువలేను అన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ కు మంచి పేరు తెచ్చపెట్టారని అభినందించారు. గ్రామాలను అభివృద్ధి పరచడంలో, పరిశుభ్రంగా ఉంచడంలో, ఉపాధి హామీ పనుల్లో, అనేక విధాలుగా వాళ్ళు పని చేస్తున్నారని, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని మంత్రి చెప్పారు. ఎంపీ ఓ ల సమస్యలు ఏమైనా ఉంటే, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. వరంగల్ హనుమకొండ మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ ఓ ల సంఘం క్యాలెండర్, డైరీని మంత్రి ఎర్రబెల్లి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ వారిని, సంఘాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ల సంఘం నాయకులు శేషు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply