– నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి
దేవరకొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యూత్ కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ – యువ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలునాయక్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేవరకొండ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో తన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డికి అనేక దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయని రఘువీర్ రెడ్డి గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతీ కార్యకర్తకు ఆయన అభయహస్తం అందించారన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ లాంటి వారిని నాయకుడిగా తీర్చిదిద్దింది జానారెడ్డేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అభ్యర్థి ఎవరైనా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ శ్రేణులు శక్తి వంచన లేకుండా నల్గొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించేలా కృషి చేయాలని కుందూరు రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడూ.. పెద్దలు జానారెడ్డి గారి శిష్యరికంలో ఎదిగిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త నేడు ఉన్నతస్థితిలో ఉండటం గర్వకారణమన్నారు. జానారెడ్డి లాంటి మహానాయకుడు నల్గొండ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు. జానారెడ్డి లాగానే ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ ఇంఛార్జి కొర్ర రాంసింగ్, నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,లు మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక సంస్థ ఎన్నికల్లో గుర్తించాలని కోరారు.
జడ్పీటీసీలు గా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు అరుణ్ మీర్జా, నల్గొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరీ రాజా రమేష్ యాదవ్, చిత్రియాల పీఎసీఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, మాజీ సర్పంచ్ పున్నవెంకటేశ్వర్లు, బిక్కు నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జరుపుల లక్ష్మి, ఎంపీటీసీ కొర్ర గౌతమి, నాగరాజు, సుర్జిత్ యాదవ్, అంబేద్కర్, రమేష్, వివిఆర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.