బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం

– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

బాలసుబ్రహ్మణ్యం వంటి మహాగాయకుడి విగ్రహాన్ని తొలగించడం ద్వారా ఈ ప్రభుత్వం బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ మండిపడ్డారు. గుంటూరు లక్ష్మిపురం సెంటర్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కళాదర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యం విగ్రహాన్ని తొలగించడం అన్యాయం అని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గుంటూరులో 200పైగా విగ్రహాలకు అనుమతిలేదని, వాటిని తొలగించకుండా, దీనిని తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు చందాలు వేసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గపు చర్య అన్నారు. బాలు విగ్రహన్ని తొలగించి ఈ ప్రభుత్వం కళాకారులను అవమానించిందని మండిపడ్డారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు. బాలసుబ్రహ్మణ్యం అంతటి గాయకుడికి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని శిష్ట్లా లోహిత్ ప్రశ్నించారు.