Suryaa.co.in

Andhra Pradesh

జిల్లాల పునర్విభజనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి

– భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని జిల్లాల ఏర్పాటు జరగాలి
-ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ గత మూడు రోజులుగా అద్దంకి జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు,అనంతరం దీక్షాశిబిరంనకు చేరుకుని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ,పలువురు తెదేపా నేతలు

అనంతరం గొట్టిపాటి మాట్లాడుతూ..
జిల్లాల పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా, అనాలోచితంగా చేయడం జరిగింది.ప్రత్యేకించి పార్లమెంట్ వారీగా విభజన చేయటం అసంబద్ధమైన చర్య.విభజన ప్రజల అవసరాలు ఆలోచనలు,భోగోళిక పరిస్థితులు,సాంస్కృతిక, చారిత్రిక నేపథ్యం,ఆయా ప్రాంతాల వెనుకబాటుతనం,వనరుల లభ్యత మొదలగు అంశాల ఆధారంగా ఉండాలి.విభజన పురోగామన చర్యగా ఉండాలి తప్ప, తిరోగమన పద్ధతిలో ఉండకూడదు. అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల పునర్విభజనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి, భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని జిల్లాల ఏర్పాటు జరగాలి.

ప్రకాశంజిల్లా 1970 సంవత్సరంలో కర్నూలు జిల్లా నుండి మార్కాపురం డివిజన్ , నెల్లూరు జిల్లా నుండి కందుకూరు డివిజన్, గుంటూరు జిల్లా నుండి ఒంగోలు డివిజన్ ఏర్పడ్డాయి. పరిపాలన సౌలభ్యం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రకాశం జిల్లా ఏర్పడింది.ప్రకాశం జిల్లా నుండి తిరిగి కందుకూరు
mla-ravi1 నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలో కలపటం ఏవిధమైన అభివృద్ధికిందికి వస్తుందో ఒకసారి ఆలోచించాలి.అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల పునర్విభజనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి, భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని జిల్లాల ఏర్పాటు జరగాలి.ఏ ఒక్క ప్రాంతానికీ ఈ పునర్విభజన ద్వారా న్యాయం జరగలేదు. ప్రస్తుత జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి మార్కాపురం 95 కిలోమీటర్లు,గిద్దలూరు150 కిలోమీటర్లు,యర్రగొండపాలెం140 కిలోమీటర్లు,కనిగిరి 80 కిలోమీటర్లు,దోర్నాల 100 కిలోమీటర్ల దూరం.

బాపట్లలో కలపాలనే అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు బాపట్ల కు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా కేంద్రానికి అతి దగ్గరగా ఉంది.కందుకూరు నియోజకవర్గం ఒంగోలుకు 40 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంది. నెల్లూరుకు కందుకూరు 120 కిలో మీటర్ల దూరంలో ఉంది.కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడం అనే ప్రతిపాదన సమంజసం కాదు.

రాష్ట్రంలో24 మండలాతో ఉన్న అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ గా ఉన్న కందుకూరును పూర్తిగా రద్దు చేశారు.కందుకూరు అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ రద్దు చేయడం సమంజసం కాదు,కందుకూరు డివిజన్‌ ను కొనసాగించాలి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. అంటే రెవెన్యూ డివిజన్ల సంఖ్యను పెంచాలి.

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఉన్న 3 రెవెన్యూ డివిజన్ల (ఒంగోలు, మార్కాపురం, కందుకూరు)లను వికేంద్రీకరణ చేసి ఇంకో 3 పెంచి మొత్తం 6 రెవిన్యూ డివిజన్లుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.జిల్లా విభజన తప్పనిపరిస్థితి అయితే ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను, మార్కాపురం కేంద్రంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలి. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కందుకూరు నియోజకవర్గాలతో ఏర్పాటు చేయాలి.మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన మార్కాపురం, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి.మార్కాపురం కొత్త జిల్లాతో మరింత వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి సమగమ్రైన అభివృద్ది ప్రణాళికతో రూపురేఖలను మార్చే అవకాశం ఉంటుంది. జిల్లాల పునర్విభజన పై పునరాలోచించి నూతన ప్రతిపాదనలపై ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని పరిశీలించాలని,తద్వారా పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం చేసే జిల్లాల పునర్విభజన సరైన ఫలితాలను ఇస్తుందని ఎమ్మెల్యే సూచించారు.

LEAVE A RESPONSE