– పేదలకు సొంత ఇల్లు హోదా కల్పించడం కోసమే ఓటీఎస్..
– అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా..!
– ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చట్టం చేస్తే.. ఇక చంద్రబాబు దొంగ ఓట్ల పప్పులుడకవ్..
– పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ప్రెస్ మీట్
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యానికి కూడా రేటు తగ్గించకుండా, ప్రతి గింజా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
– సీఎం అధ్యక్షతన ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో.. రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆర్బీకే కేంద్రాల్లో అవసరమైతే అదనంగా ఉద్యోగులను నియమించుకునైనా, మిల్లర్లతో ప్రమేయం లేకుండా, వాళ్ళకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అలానే, రంగుమారిన, వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి కూడా రేటు తగ్గించకుండా, గిట్టుబాటు ధర కల్పించి, ప్రతి గింజా కొనుగోలు చేయాలని చెప్పారు.
21 రోజుల్లోనే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాం. దాదాపు 6.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ఈ సీజన్ లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి, పొరుగున ఉన్న తెలంగాణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదని, దాళ్వాలో వరి వేయొద్దు, కొనుగోళ్ళ కేంద్రాలు పెట్టం, కొనలేము అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్న వాతావరణంం, పరిస్థితులు చూస్తున్నాం.
– రాష్ట్రంలోనూ ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి , ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు అన్నది మనం చెప్పే అంశమే గానీ, బలవంతంగా ఈ పంట వేయాలి, వేయొద్దు అని మనం చెప్పవద్దు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఉన్న పరిస్థితులు, వనరులు, వ్యవసాయ నిపుణల అభిప్రాయాల
మేరకు.. ఏ పంట వేయాలో రైతులకు తెలుసు. ఏ పరిస్థితులు ఎదురైనా, రైతులు పండించిన ధాన్యం, ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీరాల్సిందే,రైతుకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే, వాటిని సరిచేసుకుని, మంత్రులు, జిల్లా అధికారులంతా రైతుల దగ్గరకు వెళ్ళి, ధాన్యం కొనుగోళ్ళలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిశీలించి ఎక్కడికక్కడ పరిష్కరించమని చెప్పారు. సంక్రాంతి వరకు పెద్దఎత్తున ధాన్యం వస్తుంది కాబట్టి, అధికారయంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుంది.
పేదలకు సొంత ఇల్లు హోదా కల్పించడం కోసమే ఓటీఎస్..
– రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు తణుకులో పేదల ఇళ్ళకు సంబంధించి శాశ్వత హక్కులు కల్పించే విధంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, వన్ టైం సెటిల్ మెంటు(ఓటీఎస్)ను ముఖ్యమంత్రిగారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.
– కొన్నేళ్ళుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళకు సంబంధించి, బ్యాంకు రుణాలు కట్టలేకపోవడం, దాంతో ఇంటి పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గరే ఉండటం, పొజీషన్ సర్టిఫికేట్ లేకపోవడం, దాంతో వచ్చిన కాడికి పేదలు లక్షకో, రెండు లక్షలకో తెగనమ్ముకోవడం, ప్రభుత్వ స్థలం అని రికార్డుల్లో ఉన్నప్పటికీ చేతులు మారిన కొంతమంది 5 నుంచి 10 లక్షలు పోసి మంచిగా ఇళ్ళు నిర్మించుకున్నా వాటిమీద ఎటువంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.
– ఇటువంటి పేదల ఇళ్ళు దాదాపు 50 లక్షలకు పైగా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు ఇచ్చిన రుణాలతో రూ.70 వేలో, రూ.1 లక్షతోనో నిర్మించిన ఇళ్ళు అవి కాదు. గతంలో ఎన్టీఆర్ ఇచ్చినటువంటి రూ. 35 వేలతో నిర్మించినవి కూడా కాదు. ప్రతి పేదవాడు, పైసా పైసా కూడబెట్టుకుని, ప్రభుత్వం ఇచ్చిన దానితోపాటు, ఆ ఇళ్ళపై రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసుకుని నిర్మించుకున్నారు.
అంత ఖర్చు పెట్టి నిర్మించుకున్నా, ఆ ఇంటిపై హక్కు లేక, దస్తావేజులు బ్యాంకుల్లో ఉండి, పది లక్షలు విలువ చేసే ఇంటిని రూ. 2-3 లక్షలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన 3648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో దాదాపు 2 కోట్లమంది ప్రజలను కలిస్తే.. ఆ పాదయాత్రలో ఎంతో మంది పేదలు ఈ విషయాన్ని జగన్ గారి దృష్టికి తెచ్చారు. ఆరోజు పేదలకు శాశ్వత గృహ హక్కు కల్పిస్తానని ఇచ్చిన మాట మేరకే.. ఈరోజు ఓటీఎస్ స్కీం తెచ్చారు. బ్యాంకుల్లో ఆ ఇంటిపై అప్పు లక్ష ఉన్నా, రెండు లక్షలు ఉన్నా, మూడు లక్షలు ఉన్నా.. అప్పు ఎంత ఉన్నా.. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నామ మాత్రం ఫీజులు అంటే.. రూ. 10 వేలు, 15 వేలు, 20 వేలు కడితే.. ప్రభుత్వమే వన్ టైం సెటిల్ మెంటు కింద, వాస్తవానికి 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు అంటే, రెండు లక్షలు అవుతున్నా, ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తుంది.
పేదలు జగన్ గారికి అండగా ఉన్నారనే బాబు అండ్ కో కడుపు మంట
– ఇది బలవంతం కాదు. సొంత ఇల్లు అనిపించుకోవాలనే కోర్కె ఉండే పేదలకోసం.. ముఖ్యమంత్రి గారు స్కీము పెడితే, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి.. రోజూ పది మంది పనికిమాలినవాళ్ళను టీవీ ఛానళ్ళలో కూర్చోబెట్టి.. జగన్ గారు పేదల రక్తం పీల్చేస్తున్నారంటూ విషం కక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబుకు వంత పాడే చెత్త పేపర్లు, డబ్బా మీడియా రోజూ విషం కక్కుతున్నా జగన్ మోహన్ రెడ్డిగారి మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా తగ్గించలేరు.
– వన్ టైం సెటిల్ మెంటు స్కీం వల్ల దాదాపు 50 లక్షల మంది పేదలు సొంత ఇంటికి యజమానులు అవుతారు. దీంతో ఆ కుటుంబాల వారంతా జగన్ మోహన్ రెడ్డిగారికి అండగా ఉంటారు అనే కడుపు మంటతోనే చంద్రబాబు, ఆయనకు వంత పాడే మీడియా దీనిపై బురదజల్లాలని చూస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉంటే, ఆయన్ను అడ్డం పెట్టుకుని బతకడానికి అలవాటు పడ్డ వారి అనుకూల మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తుంది. ఈ స్కీము వల్ల జగన్ గారికి ఏమైనా నష్టం జరిగేటట్టు అయితే.. ఈ చెత్త మీడియా తడిగుడ్డ వేసుకుని నిద్రపోయేవారు. ఇంకా ప్రోత్సహించేవారు. వీళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి కాబట్టి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. పొద్దున్నుంచీ.. రాత్రి వరకు జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమం మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్న వారికి, కనీసం డిబేట్లలో డ్రసులు కూడా మార్చడం లేదు. ఆ టీవీలో కొంతసేపు కనిపిస్తారు.. మళ్ళీ వారే మరో టీవీలో ఆ నలుగురే కనిపిస్తారు. జనం ఏమనుకుంటారో అన్న సిగ్గు కూడా వీళ్ళకు లేదు.
– ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది ఓటీఎస్ స్కీములో కట్టి ఇళ్ళు సొంతం చేసుకోవటానికి ముందుకొచ్చారు. తణుకులో జగన్ గారి చేతుల మీదుగా రేపు లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది.
– చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే దుర్మార్గులు, దుష్టుల మాటలు నమ్మకుండా, జగన్ గారు పేదల మేలు కోసం చేస్తోన్న ఓటీఎస్ స్కీమును వినియోగించుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు జన్మలో ఇటువంటి మంచి పని చేయరు.
జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు మేలు
– గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ సౌజన్యంతో.. రాష్ట్రంలో “జగనన్న పాల వెల్లువ” కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో 5 రోజులు క్రితం 5-6 మండలాల్లో లాంఛనంగా ప్రారంభిస్తే.. స్థానికంగా ఉన్న విజయ డైరీ పోటీకి వచ్చి, పాడి రైతులకు లీటరుకు రూ. 6.50 పెంచి డబ్బులు చెల్లిస్తున్నారు. అంటే, జగన్ గారు తీసుకొచ్చిన జగనన్న పాల వెల్లువ కార్యక్రమం వల్ల, పాడి రైతులకు ప్రతి లీటరుకు రూ. 6 నుంచి 7 ఆదాయం పెరిగింది. అంటే, ఒక గేదె ఉన్న పాడి రైతుకు, రోజూ ఐదారు లీటర్లు అమ్ముకునే రైతుకు కూడా నెలకు రూ. 1200-1300, ఏడాదికి రూ. 15 – 20 వేలు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జగన్ మోహన్ రెడ్డిగారు పాడి రైతులకు మేలు చేసే ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం వల్లే ఈరోజు మేలు జరుగుతుంది.
హెరిటేజ్ లూటీ..
– అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే… హెరిటేజ్ కోసమో, మరొకరికోసమో దీనిని తీసుకువచ్చారని ఇదే చంద్రబాబు, ఆయనకు డబ్బా కొట్టే ఓ వర్గం మీడియా అంతా ఏడిచారు. ఆ వర్గం మీడియాలో కూడా నిత్యం అవే రాతలు రాసి రాక్షసానందం పొందారు. ఈరోజుకైనా నిజం తెలుసుకుంటే మంచిది. జగన్ గారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వల్ల ప్రతి పాడి రైతుకు, పాడిని నమ్ముకుని బతికే ప్రతి పేద మహిళ కూడా లబ్ధి చేకూరుతుందన్నది చంద్రబాబు, ఆయనకా బాకా ఊదే మీడియా తెలుసుకోవాలి.
ఇంతకాలం చంద్రబాబు ఇంటి సంస్థ హెరిటేజ్ పేరుతో ఒక్క గేదె ఉన్న పేద పాడి రైతు నుంచి ఏడాదికి 15 వేల రూపాయలకు పైగా లూటీ చేశారు. అంటే, పాడి రైతుల సొమ్మును ఏ విధంగా తిన్నారో ప్రజలు గమనించాలి. ఇంతకాలం డైరీల పేరుతో జిల్లాలు పంచుకుని మరీ పాడి రైతుల్ని, మహిళల్ని లూటీ చేసిన వారికి గట్టి దెబ్బతగులుతుంది.
– జగనన్న పాల వెల్లువ వచ్చింది కాబట్టి రేటు వచ్చింది, ఈ కార్యక్రమానికే మీరు ఇస్తే.. లాభాలు వచ్చిన వాటిని డివిడెండ్ల రూపంలో రైతులకే ఖర్చు పెడుతుంది. రాష్ట్రంలో ఉన్ మహిళలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇక చంద్రబాబు దొంగ ఓట్ల పప్పులుడకవ్..
– చంద్రబాబు అంటేనే మేనేజ్ చేయటం.. మ్యానిపులేట్ చేయడం అని అందరికీ తెలుసు. ఆ విద్యలతోనే ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 వేలు దొంగ ఓట్లు చేర్చుకుని అడ్డగోలుగా గెలవాలని చూస్తున్నాడు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 6 నుంచి 10 వేలు, చుట్టు పక్కల నియోజకవర్గాలకు చెందిన వారి ఓట్లతో సహా దొంగ ఓట్లను చేర్పించాడు. ఓటరు కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేస్తూ.. పార్లమెంటులో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ఆమోదించడంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక సామెతలో తయారవుతుంది. ఈ నిర్ణయం వల్ల కుప్పంలో కూడా 10 వేల దొంగ ఓట్లు పోయే పరిస్థితి ఉంటుంది. పార్లమెంటు ఈ చట్టం చేస్తే.. రాష్ట్రానికి చంద్రబాబు పీడ శాశ్వతంగా విరగడ అవుతుంది.
చంద్రబాబు ఫేస్ చూసి అప్పులు ఇస్తారా..?
– చంద్రబాబు అధికారంలో ఉంటే.. చంద్రబాబు ఫేస్ చూసి బ్యాంకుల వాళ్ళంతా అప్పులు ఇచ్చేస్తాం రండి అంటారని ఆ వర్గం మీడియా భజన చేస్తుంది. అదే మీడియా జగన్ గారు అధికారంలోకి రాగానే, ఆయన ఫేస్ చూసి అందరూ వెళ్ళిపోతున్నారు అని మొదటి ఆరు నెలలు రాశారు. మళ్ళీ అదే మీడియా, ఆ తర్వాత జగన్ గారు చేసినంత అప్పు ఎవరూ చేయడం లేదు అని చెత్త డిబేట్లు పెడుతున్నారు. ఎవరైనా అప్పులు ఎందుకిస్తారు, చంద్రబాబు ఫేస్ చూసి ఇవ్వరు. ఈ రాష్ట్రంలో వనరులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని, మళ్ళీ ఎలా తీరుస్తారో చూసే బ్యాంకులు అప్పులు ఇస్తాయి.
ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందుతున్న విద్య, వైద్య రంగాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు.. వీటన్నింటినీ చూసి ఎవరైనా అప్పులు ఇస్తారు.
– రామోజీరావు, రాధాకృష్ణలు రాష్ట్రం గురించి బాగా రాయలేదనిగానీ, వాళ్ళు బాగా రాశారనిగానీ అప్పు ఇచ్చే పరిస్థితి ఉండదు. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్ళు ఆయన జీవించి, మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు జగన్ చేస్తారు.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
మహిళల ఉసురు బాబుకే తగులుతుంది
– మహిళల గురించి మాట్లాడుతున్న భువనేశ్వరి గారు ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆరోజు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలో ఏడిపించారు. లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బజారు పాలు చేశారు. వారందర్నీ ఏడిపించిన దుర్యోధనుడు చంద్రబాబే. వాళ్ళ ఉసురు తగిలే కదా ఈరోజు రాజకీయంగా దిక్కుమాలిన పరిస్థితిల్లోకి చంద్రబాబు వెళ్ళారు. మహిళల ఉసురు తగిలి పూర్తిగా నాశనం అయ్యి, వచ్చే ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతాడు.
– మహిళల ఉసురు తగిలేకదా.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేసిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోయి, అర్థరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయి, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుని హోదా కూడా పోయి, మరింత సర్వనాశనం అవుతాడు. భువనేశ్వరి చెప్పినట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. భార్యను అడ్డుపెట్టి ఎవరన్నా రాజకీయాలు చేస్తారా. అటువంటి వ్యక్తి సర్వనాశనం అవుతాడు.
– ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టుగా తండ్రి చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడు, అవినీతిపరుడు, ప్రతిదీ మోసం, వంచన, దగా చేసే అతని కొడుకు లోకేష్ కు కూడా అవే గుణాలు అబ్బాయి. గాడిద ను తీసుకొచ్చి గుఱ్ఱంలా పెంచితే గాడిద గుఱ్ఱం కాలేదు కదా..
అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా..!
– చంద్రబాబు పగటి వేషగాడిలా తన డప్పు తాను కొట్టుకోవడం బాగా అలవాటు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టు తాను కట్టానంటాడు. చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా చర్చకు నేను వస్తా. చర్చకు సిద్ధమా..?
– శంషాబాద్ ఎయిర్ పోర్టు కు శంఖుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసిందీ రాజశేఖరరెడ్డి గారే..
– అవుట్ రింగు రోడ్డుకు శంఖుస్థాపన చేసిందీ, ప్రారంభోత్సవం చేసిందీ రాజశేఖరరెడ్డిగారు
– పోలవరం రూపకర్త నేనే, పోలవరం నేనే కట్టానంటాడు.. చంద్రబాబు పోలవరం కట్టాడా..?
– అమరావతి సృష్టికర్తను నేనే అంటాడు. అక్కడ ఏమైనా ఉందా.. గ్రాఫిక్స్ సృష్టించాడు. చంద్రబాబు భ్రమరావతిలో ఒరిజనల్ అమరావతి ఉందా.. అసలు అమరావతి ఎక్కడ ఉంది. అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా.. ?
– చంద్రబాబు చెప్పేవాటిలో ఒక్కటి నిజం ఉన్నా నేను రాజకీయాలు వదిలేసి వెళతా. చంద్రబాబు సిద్ధమా..?
సలహాలు ఇవ్వడం మాని పవన్ కల్యాణ్ చేయాల్సింది చేయాలి
పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపాల్సింది కేంద్రం. మేం ఏం చేయాలో మేము చేస్తాం. ఆయనది అసలు ఏ పార్టీనో కూడా తెలియడం లేదు. జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనను మేమైనా సలహాదారుడిగా పెట్టుకున్నామా…? మాకు సలహాలు ఇవ్వటం మాని, ఆయన చేయాల్సింది చేయాలి.
బీజేపీతో సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ, అమిత్ షా , రాష్ట్ర బీజేపీ నాయకులు ఏమీ అనుకోకుండా.. నీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో పవన్ కల్యాణ్.
సలహాలు ఇవ్వాలనుకుంటే.. తన దత్త తండ్రి బాబుకు పవన్ కల్యాణ్ సలహాలు ఇచ్చుకోమనండి. మాకు పనికి మాలిన సలహాలు వద్దు.