Suryaa.co.in

Devotional

మన పండుగల గొప్పతనం ..

మనం చేసుకునే పండుగల పరమార్ధమేమిటో చాలామందికి తెలియదు. కానీ ఎవరి స్థాయికి తగినట్లు వారు పండుగలు చేసుకుంటారు. అయితే.. ప్రతి పండుగకూ ఒక పరమార్ధం, ఒక సందేశం దాగుంది. వాటి కథేమిటో చూద్దాం.
ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి:- భార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
నాగుల చవితి:- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

LEAVE A RESPONSE