కూసింది కోయిలమ్మ ..పూసింది పూలరెమ్మ
ఝల్లు మనే చల్లని పవనం ..
ఆపైన లేలేత రవికిరణం ..
భువి తొడిగే పచ్చదనం ..
ఉదయాల వెచ్చదనం ..
హృదయంలోనే జరిగే సూర్యోదయం ..
హరిత వనముల వెంట తుమ్మెదల ఝుంకారం ..
లలిత కుసుమాల మధువులే కోరి ఆ ఆరాటం ..
చిరుచిరు నగవులే చిందే ఆనందం ..
తామస హరణం తదుపరి వెలుగుల బంధం
మధురోహలతో మరురోజుకి స్వాగతం
– రాధిక ఆండ్ర