Suryaa.co.in

National

అప్పడాలమ్మకు అత్యున్నత పురస్కారం

ఈమె పేరు జస్వంత్తి బెన్. ఆమెకు ఇప్పుడు 91 సంవత్సరాలు..
1959లో చేతిలో ఉన్న 80 రూపాయలతో “లిజ్జత్ పాపడ్స్” పేరుతో అప్పడాల వ్యాపారం ప్రారంభించింది. ఆమెను చూసి అప్పుడు అందరూ నవ్వుకున్నారు. అప్పడాల వ్యాపారం చేస్తుందట అంటూ గేలి చేశారు. ఆమె కుంగిపోలేదు. 1960 లో ఆమె అప్పడాలు ఆరబెట్టడానికి ప్యాక్ చేయడానికి ఒక మంచం, స్టవ్‌ని కొనుగోలు చేసింది. ఇప్పటికి 62 సంవత్సరాల నుండి నిరాఘాటంగా వ్యాపారం చేస్తోంది.నేడు ఆమె టర్నోవర్ 1810 కోట్లు..ఆమెతో 46,500 మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు సంవత్సరానికి 4 బిలియన్ల (400 కోట్లు) అప్పడాలు తయారు చేస్తారు.. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఆమె విజయ గాధను ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో గౌరవించింది.

LEAVE A RESPONSE