Home » ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి ప్రసవం

ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి ప్రసవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు.
మాధవి తొలి కాన్పుకోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేరగా, పరీక్షించిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు నిపుణులు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడంతో మగ శిశువ జన్మించారు. ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై .రాజశేఖర్‌రెడ్డి శిశువును పరీక్షించి వైద్యాన్ని అందజేశారు.
జిల్లా కలెక్టర్ సతీమణి సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ దంపతుల నిర్ణయంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు .

Leave a Reply