– ఈ నెల 31నుంచి మార్చి 16 వరకు పెళ్లి సందడి
‘‘పెళ్లంటే పందిళ్లు సందిళ్లు తప్పుట్లు తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్లు.. ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్లు’’
అని పెళ్లి కావలసిన వారు పాడుకోవలసిన సమయం వచ్చేసింది. అవును. మాఘమాసం మరో రెండురోజుల్లో వచ్చేస్తోంది. కాబట్టి ఇక మార్చి వరకూ మౌనరాగాలు ఉండవు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు.
పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం అవుతుండడంతో పెళ్లిళ్ల సీజన్ షురూ కానుంది. మాఘమాసం వచ్చేస్తోంది. ఈ నెల 30 వ తేదీన మాఘమాసం ప్రారంభం కానుంది.
మాఘమాసం అంటే పెళ్లిళ్ల సీజన్ అని అందరికీ తెలి సిందే. ఈ నెల 31నుంచి మార్చి 16 వరకు పెళ్లి సందడి షురూ కానుంది. ఈ నాలుగు మాసాలు మార్చి, ఏప్రిల్,మే జూన్, నెలల్లో దాదాపు ముహూ ర్తాలు ఉన్నాయని పంచాం గకర్తలు చెబుతున్నారు.
ఫిబ్రవరి- 2, 3, 7,13,14,15, 18, 19,20,21,23,25, లో మంచి ముహూర్తాలు ఉండగా..
మార్చి – 1,2,6,7, 12,
ఏప్రిల్– 14, 16, 18, 19,20, 21,25,29, 30