– నంది అవార్డులకు గద్దర్ అవార్డులు అని పేరు పెట్టారు
– ఎవరి అభిప్రాయాలను తీసుకొని ఆ పేరు పెట్టారు?.
ఫెడరల్ స్ఫూర్తి మందికి ఉండాలి కానీ మీకు మాత్రం ఉండొద్దు
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ రెడ్డి
హైదరాబాద్: జనవరి 26నాడు రైతు భరోసా డబ్బులిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ప్రజలు తిరగబడతారని, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి పద్మ అవార్డుల అంశాన్నికాంగ్రెస్ నాయకులు తెరమీదకి తీసుకొచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ వారు మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చారు. పద్మ అవార్డుల అంశంపై నిప్పు పెట్టి అగ్గిరాజేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటిది? పద్మ అవార్డును గద్దర్ , అందెశ్రీ , గోరటి వెంకన్న కి ఎందుకివ్వలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం ముగ్గురు దళిత బిడ్డల పేర్లనే తీసుకొని విమర్శలు చేయడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏంటి..?
మందకృష్ణ మాదిగకి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇస్తే….ఓర్చుకోలేని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ, మాల సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఎజెండా.
భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని పార్లమెంటు ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని దేశం అంతా తిరిగిన రాహుల్ గాంధీ, అబద్దపు ప్రచారంతో దళిత బిడ్డలను భయబ్రాంతులకు గురి చేశారు.
భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రాజ్యాంగానికి, ఎస్సీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందక్రిష్ణ మాదిగ కి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మోదీ ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ ను ప్రారంభించారు.
మందకృష్ణ మాదిగ కి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇస్తే దళిత బిడ్డలు బిజెపి వైపు వెళ్తారని కాంగ్రెస్ నాయకులు వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆటకెక్చించి, పెట్టుబడులను గాలికొదిలేసి, దళిత కార్డు వాడి పద్మ అవార్డులను రాజకీయం చేయాలని చూస్తే బండి సంజయ్ సిద్థాంతం అనే కార్డు వాడారు.
గద్దర్ , గోరటి వెంకన్న , అందెశ్రీ విషయంలో వ్యక్తిగతంగా వారిపట్ల తక్కువ గౌరవం లేదు. మందకృష్ణ మాదిగ ఇప్పటివరకు ఒకటే సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలను వక్రీకరించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
మాది ఫెడరల్ స్ఫూర్తి అని అంటున్న రేవంత్ రెడ్డి ….తెలంగాణ రాష్ట్రంలోని నంది అవార్డులకు గద్దర్ అవార్డులు అని పేరు పెట్టారు. ఎవరి అభిప్రాయాలను తీసుకొని ఆ పేరు పెట్టారు?. ఫెడరల్ స్ఫూర్తి మందికి ఉండాలి కానీ, మీకు మాత్రం ఉండొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ ని నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిధ్దంగా లేరు. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ మీవెంట పడుతది.
దళిత కార్డు, బహుజన కార్డు వాడి మమ్మల్ని బెదిరించడానికి చూస్తే… ఎవరూ కూడా భయపడడానికి సిధ్దంగా లేరని రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో పార్టీ కేంద్ర అధిష్టానమే నిర్ణయం తీసుకుంటది.