కొబ్బరాకుల సందుల నుంచి
కార్తీక మాసపు చందమామ
శృంగారంగా తొంగిచూస్తూ
శుభ్ర జ్యోత్స్న లను వెదజల్లే!
ధరణికి అతి చేరువుగా వచ్చి
కన్నె కలువల కనుదోయిలోన
కోట్లు కాంతులను విరజిమ్మే
చూసిన కళ్లను పండుగ చేసే!
ఏడాదికొకసారి కార్తీక చంద్రుడు
అనురక్తితో అవనికి అతిథిలా వచ్చే
శివుడి శిరస్సులోని నెలవంకలా
కోనేటిలో కొలువైన పోలి దీపంలా!
భక్తి రసాలను ప్రమిదలలో పోసి
రక్తిగా వెలిగించే కోటి కార్తీక దీపాలను
కొబ్బరాకులను కిరణాలతో కదిపి
అబ్బురంగా చూస్తున్నాడు నిలిచి
కార్తీక చందమామ కీర్తి ప్రభలతో!
– జి.సూర్యనారాయణ,6281725659