– మోప్లా తిరుగుబాటు వెనుక కధ ఏమిటి ?
1921 సెప్టెంబర్ 25,
100 సంవత్సరాల క్రితం జరిగిన భయంకర మోప్లా దారుణ మారణకాండ లో వేలాది హిందువుల ను పశువులను నరికి చంపినట్లు నరికి, ఆడవారిని యధేచ్చగా మానభంగాలు జరిపి, తర్వాత నిర్ధాక్షిణ్యంగా చంపేసిన జిహాదీ మతోన్మాద దారుణ నరసంహారం గురించి –మనకు చెప్పబడిన పచ్చి అబద్దం “మొఫ్లా తిరుగుబాటు”
మరి ఈ మోప్లాలు ఎవరి మీద తిరుగుబాటు చేసారు ? బ్రిటీష్ వారి మీదా ? కాదు.
మరి అలాంటప్పుడు “మోప్లా తిరుగుబాటు” ఎలా అయ్యింది.
మోప్లా ముస్లిములు ఊచకోత కోసింది బ్రిటీష్ వారిని కాదు. తమతో పాటు నివసిస్తున్న హిందువుల మీద. ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేసిన బ్రిటీష్ వారిని ఏమి చేయలేక ఆ కసిని హిందువుల మీద చూపారు. మలబార్ లో ఖలిఫా రాజ్యాన్ని స్థాపిస్తామన్న నినాదంతో హింసాకాండను మారణకాండను జరిపారు. అంతేకాదు ఈ ఖిలాఫత్ ఉద్యమం భవిష్యత్ లో భారత్ లో మతరాజకీయాలకూ, పాకిస్థాన్ సృష్టికీ విత్తనాలు నాటింది.
ఈ తరం వారికి ఈ చరిత్ర ఎలానూ తెలియదు, ఆఖరుకి పాత తరాల వారికి కూడా పూర్తిగా తెలియనివ్వని మహాత్ముని ఆధీన కాంగ్రెస్ , డా. అంబేద్కర్ , సరోజిని నాయుడు వంటి వారి గొణుగుళ్ళు తప్ప అసలు విషయం తెలియనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకీ అసలు ఈ మోప్లా అల్లర్లు లేదా మోప్లా మారణకాండ లేదా మోప్లా తిరుగుబాటు వెనుక కధ ఏమిటి ?
టర్కీ సుల్తాన్ యావత్ ఇస్లామిక్ ప్రపంచానికి ఖలీఫా గా చలామణీ అయ్యేవారు. టర్కీలో ఉదారవాద కెమల్ పాషా నాయకత్వంలో బ్రిటీష్ వారి పూర్తి మద్దత్తు తో ఖలీఫాను గద్దె దించేసారు. ప్రపంచవ్యాప్తంగా కాకపొయినా ముస్లిములు ఖలీఫా పున:ప్రతిష్ట చేయాలని ఉద్యమించారు.. దానినే ఖిలఫత్ ఉద్యమం అని పిలిచేవారు. అయితే ఈ ఉద్యమంలో టర్కీ ప్రజలు తిరుగుబాటుదారు కెమల్ పాషా కు అనుకూలంగా ఉన్నారు.వారికి ఖలీఫా తిరిగిరావటం ఇష్టం లేదు. అనేక ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా తో సహా ఖలీఫా కు వ్యతిరేకం. బ్రిటీష్ ఆ ఉద్యమాన్ని అణచి వేసింది. ఆ సరికి ప్రపంచమంతా ఖిలాఫత్ ఉద్యమం చల్లారిపోయింది, ఒక్క భారత్ లో తప్ప. ఎందుకంటే అప్పటికే భవిష్యత్ లో జాతికి పిత కాబోతున్న, సమీప భవిష్యత్ లో మహాత్ముడనే బిరుదాంకితుడు కాబోతున్న గాంధీగారు ఖిలాఫత్ వుద్యమాన్ని హెర్కులస్ లాగా భుజాన మహా తమకం గా మోస్తున్న రోజులు. అప్పటికి పదహరణాల జాతీయవాదిగా ఉన్న మహమ్మదాలీ జిన్నా గారు సైతం, మతాన్నీ రాజకీయాన్ని మెలివేసి కలిపే ప్రమాదకరమైన చెత్త విధానాన్ని తీవ్రంగా నిరసించాడు. గాంధీ కి దగ్గర అయిన సరోజిని నాయుడు, అని బిసెంట్, వగైరాలతో పాటు గాంధీని పెద్దగా లెక్క చేయని డా.అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకించాడు. అయినా ఫ్యూచర్ జాతిపిత తలకు ఎక్కలేదు.
ఈ లోపు ఖిలాఫత్ పూర్తిగా చల్లారిపోయుంది. కేరళలో మల్లప్పురం జిల్లాలో ముస్లిములు మెజారిటీ. వాళ్ళల్లో మోప్లాలు ఒక పిడివాద కౄర ఇస్లామిక్ తెగ. వీళ్ళు ఎక్కడ నుండో పారిపోయి భారత్ కు వలస వచ్చినవారు. పిచ్చి హిందువులు వారిని మాపిళ్ళయ్ లు (అల్లుళ్ళు) గా అక్కున చేర్చుకుని ఆదుకున్నారు. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశీ ముస్లిములకూ, అతి కిరాతక రోహింగ్యాలకు ఆశ్రయమిస్తున్నట్లన్న మాట. ఖిలాఫత్ ఎప్పుడైతే విఫలమయిందో మోప్లాలలో హింసోన్మాదం ప్రజ్వరిల్లింది. తమ ప్రాంతంలో ఉన్న హిందువులను వేల సంఖ్యలో ఊచకోత కోసారు. స్త్రీలను చెరబట్టి మానభంగం చేసి మరీ చంపారు. పిల్లలని వృద్దులనీ చూడకుండానరికి వేసారు. ఏ నూతి లో చూసినా శవాలే. ఏ కాలవలో , చెరువులో చూసినా శవాలే. ఇళ్ళ దోపిడీలూ మామూలే. హిందూదేవాలయలను పగలగొట్టారు, దేవాలయాల్లో ఆవులను నరికి చంపి ఆ మాంసాన్ని హిందువులకు తినిపించారు. బలవంతంగా మతం మార్చారు. మారనివారు ఇతర ప్రాంతాలకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
బ్రిటీష్ ప్రభుత్వం ఈ హింసాకాండను అతి కష్టం మీద అణచివేసారు, హిందువులు వదిలేసిపారిపోయిన ఆస్తులు మోప్లా ముస్లిములు లాగేసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్ లాంటి చోట జరగబోయే భావి హింసకు ఇది నాందీ అన్నమాట. ప్రపంచమంతా ఈ ఘోరకలిని ఖండించింది, ఒకే ఒక్కడు తప్ప. భావిభారత జాతిపితాశ్రీ గారు ఈ మారణకాండలో మోప్లా ముస్లిముల వీరత్వం చూసారు. మోప్లాలలో మత నిష్టా గరిష్ట అంకితభావం వీక్షించారు. మోప్లా ముస్లిములు తమ మత గ్రంధంలో ఏమి చెప్పబడి ఉన్నదో దానినే వీరోచితంగాపాటించారు తప్ప అందులో వారి తప్పేముంది అంటూ ఎంతో అమాయకంగాఈ సమాజాన్ని ప్రశ్నించారు. మరి రేపోమాపో “మహత్మ” భుజకీర్తులు తగిలించుకోబోతున్న అంత మహావ్యక్తి చెప్పిన తర్వాత కాంగ్రెస్ మాత్రం అదే ప్రచారం చేయక చస్తుందా ?
అందుకే “మోప్లా మారణకాండ” కాస్త “మోప్లా తిరుగుబాటు” గా జనం లోకి ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ కేతిగాళ్ళు ఈ మారణకాండకు మరింత మేకప్ చేసి చెమ్కీలు అద్ది “మోప్లా రైతుల విప్లవ పోరాటం” గా గ్రాఫిక్స్ సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. మనము నాజూకు నాగరీకులము. ఇలాంటి అల్పమైన విషయాలు మనకు అనవసరము. ఎక్కడో ఏదో జరిగితే మనకేల ? మనము ప్రస్తుతానికి పచ్చగానే ఉన్నాము. మన పెళ్ళాం బిడ్డలు హాయిగానే ఉన్నారు. మన కులనాయకులు వర్ధిల్లుతూనే ఉన్నారు. మన కులపార్టీలు శక్తివంచన లేకుండా కులసంక్షేమం కోసమూ, గాంధేయ బ్రాండ్ సెక్యులర్ విలువల కోసమూ నిరంతరమూ కృషి చేస్తూనే ఉన్నాయి. అంతకంటే ఇంకేమి కావాలి?
– గౌరీశంకర్ టేకి