Suryaa.co.in

కొత్త సీపీ కాంతి రాణా దూకుడు
Andhra Pradesh Crime News

కొత్త సీపీ కాంతి రాణా దూకుడు

– చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్
ఛార్జ్ తీసుకోవడం తోనే ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్ పెట్టే క్రమంలో కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీ అర్ ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన నేరానికి సంబంధించిన నేరస్తలాన్ని పోలీస్ కమిషనర్ కాంతి రాణా సందర్శించి, నేరం జరిగిన తీరుతెన్నులను తెలుసుకోవడం అలానే బాధితులను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇతర రాష్ట్ర క్రైమ్ పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపించామని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని అపార్ట్మెంట్ లలో నేర నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సంబంధిత స్టేషన్ సీఐ కు ఆదేశాలు జారీచేశారు. పోలీస్ కమిషనర్ వెంట డీసీపీ హర్షవర్ధన్, బాబురావు, క్రైమ్ బ్రాంచ్ ఎడిసీపీ శ్రీనివాస్, వెస్ట్ ఏసీపీ హనుమంత్ రావు, క్రైమ్ ఎసీపీ శ్రీనివాస్, కొత్త పేట సీఐ మోహన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.

LEAVE A RESPONSE