Suryaa.co.in

Telangana

భవిష్యత్ లో జీన్ ప్యాంట్లు, టీ షర్ట్, రబ్బర్ చెప్పుల రాజ్యం రాబోతోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
– బోరవెల్లి గ్రామంలో ప్రజల గోస… బిజెపి భరోసా..

తెలంగాణలో భవిష్యత్ లో జీన్ ప్యాంట్లు, టీ షర్ట్, రబ్బర్ చెప్పుల రాజ్యం రాబోతోంది.

జీన్ ప్యాంట్లు, టీ షర్ట్, రబ్బర్ చెప్పులు గాళ్లు తల్చుకుంటే ఏమౌతదో దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో చూపెట్టారు.టీఆర్ఎస్ పాలనలో పోలీసులకు ప్రమోషన్లు రావు..కాని, టీఆర్ఎస్ నేతల ఆదేశాలతో బిజెపి కార్యకర్తలపై దాడులు, లాఠీచార్జ్ లు చేస్తున్నరు.

బిజెపి పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. కాని, కొంతమంది ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగేవాళ్లు ఉన్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది బిజెపి కార్యకర్తలు, పోలీసులు ప్రాణత్యాగం చేశారు.కేసీఆర్ కులాలు, మతాలను, సంఘాలను చీల్చుతూ చిచ్చు రేపుతున్నడు.

తొలి విడత సంగ్రామ యాత్రలో పేదలకు ఉచిత విద్య-ఉచిత వైద్యం ఇస్తామని ప్రకటించినం. కేసీఆర్.. ఆర్డీఎస్ ద్వారా నీళ్లందిస్తమని పొలాలను కాల్వల్లో గడ్డి మొలిచి ఎండిపోయాయి.. చుక్కనీరు లేక పొలాలు బీళ్లు పారుతున్నయ్. కేసీఆర్ కుర్చీ వేస్కొని ఆర్టీఎస్ ను ఆదునీకరిస్తం.. లిఫ్టులు కట్టిస్తమని మాటలు చెప్పి పత్తా లేకుండా పోయిండు.

బిజెపి ప్రభుత్వం రాగానే ఆర్డీఎస్ ద్వారా పాలమూరు పొలాలకు నీళ్లందించేలా పనులు చేపడుతం.

రుణమాఫీ కాని, దళిత బంధు రాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని ఊర్లున్నయి.. కాని, కేసీఆర్ పెట్టిన మద్యం షాపులు లేని ఊరు లేదు.పేదలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే..కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ తో పాటు కొవిడ్ రక్షణ పరికరాలు, మందులు ఇచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం.

తెలంగాణకు లక్షా 40 వేల ఇండ్లు కేంద్రం మంజూరు చేస్తేముఖ్యమంత్రి కేసీఆర్ … రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై లక్ష రూపాయల అప్పుల భారం మోపిండు.
కేంద్రం చేపట్టే ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో కేసీఆర్ అడ్డుకుంటుండు. ఆయుష్మాన్ భారత్ ను అమలు కానియ్యడం లేదు.శ్రీకాంతా చారి, ఇషాంత్, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతోమంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైనరు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ల జాడ లేదు. ఉద్యోగాలు రాలేదు. కాని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలొచ్చినయ్.
అంగన్ వాడీలు, విద్యావాలంటీర్లు, నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి బతుకులతో ఆడుకుంటున్నడు. వరి వేస్తే ఉరి అని బెదిరించి రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పిండు. ఉద్యోగుల తరఫున మేం కొట్లాడితే.. మాపై దాడులు చేయించిండు. జైలుకు పంపిండు ఈ దౌర్బాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్.

టీఆర్ఎస్ మంత్రుల అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నరు.

ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ అనే బిజెపి కార్యకర్త స్థానిక మంత్రి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తుంటే అక్రమ కేసులు బనాయించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన్రు. అమాయకుడి ప్రాణాన్ని బలిగొన్నరు.పేదోళ్లకు పైసలిస్తే ఓట్లేస్తరు అని దురాలోచనలో ఉన్నడు కేసీఆర్….. అందుకే రాష్ట్రంలో పేదోళ్ల రాజ్యం రావాలి. కేసీఆర్ తగిన బుద్ధి చెప్పాలి. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లో ప్రజలు టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పారు.

 

LEAVE A RESPONSE