Suryaa.co.in

Andhra Pradesh

మహిళా జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం

– సమాజ ప్రగతిలో వారి సేవలు అభినందనీయం
– విజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం: నిరంతరం సవాళ్లతో కూడిన జర్నలిజం రంగంలో కూడా మహిళా జర్నలిస్టుల పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు.. సోమవారం ఇక్కడ డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం …. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంయుక్తముగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో సైతం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వారిలో మరింత ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు.. ఒకవైపు సమర్థ వంతముగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే , మరోవైపు కీలక మైన జర్నలిజం రంగంలో కూడా మెరుగైన సేవలు అందిస్తున్న మహిళా జర్నలిస్టులు అందరినీ తాను అభినందిస్తున్నట్లు మేయర్ చెప్పారు.

గౌరవ అతిథిగా హాజరైన వీఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయనిర్మల మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదంటూ అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నామన్నారు.అన్ని రంగాల్లో కూడా పురుషులతో దీటుగా మహిళలు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నట్లు ఛైర్మెన్ విజయ్ నిర్మల చెప్పారు.. పిసిపిఐఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ, గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ శోభాస్వాతి రాణి, ఈపీడిసిఎల్డి ఈ జి.సత్యనారాయణలు మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల విధులు కత్తి మీద సాము లాంటివన్నారు.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే వీరు తలచుకుంటే ఏ రంగంలో ఐనా సాధించలేనిది ఏమీ లేదన్నారు.

నిరంతరం సమాజ సేవలు అందిస్తున్న మహిళా జర్నలిస్టులు, ,పలువురు బాల కళాకకారులను మహిళా దినోత్సవం రోజున సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వీరు కోరారు.

ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె రామేశ్వరి మాట్లాడుతూ ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మహిళలకు మరిన్ని అపారమైన అవకాశాలు రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు రామేశ్వరి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కార్యదర్శి ఎస్ దుర్గారావు లు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో అనేక మంది మహిళా జర్నలిస్టులను ఘనముగా సత్కరించడం జరిగిందన్నారు. అందరి సహకారంతోనే ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీరు చెప్పారు.. ఆర్ధికముగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆన్ని కార్య క్రమాలు క్రమం తప్పకుండా తమ పాలక వర్గం నిర్వహిస్తుందన్నారు.

అనంతరం మహిళా జర్నలిస్టులు , ఆకాశవాణి ఎనౌన్సర్ కె.శ్రీదేవి తోపాటు పలువురు కళాకారులను ఘనంగా అతిధిలుచేతుల మీదుగా సత్కరించారు.వి జె ఎఫ్ .. ఉపాద్యక్సుడు ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతోపన్యాసం కార్యక్రమంలో మహిళా జర్నలిస్టుల సేవలను బాల కళాకారుల ప్రతిభను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పి. వరలక్ష్మి, ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, శేఖర మంత్రి , తదితర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE